డబ్బే డబ్బు : క్రికెటర్లకు భారీ నజరానా

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 11:18 AM IST
డబ్బే డబ్బు : క్రికెటర్లకు భారీ నజరానా

Updated On : January 8, 2019 / 11:18 AM IST

భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించినందుకు భారీగా నగదు అనౌన్స్ చేసింది. తుది జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.15లక్షలు, రిజర్వ్ ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.7.5లక్షలు ప్రకటించింది. జట్టు కోచ్‌లకు రూ.25లక్షల ప్రోత్సాహకం అనౌన్స్ చేసింది. జట్టు సహాయ సిబ్బందికి బోనస్ ప్రకటించింది. నాలుగు టెస్టుల్లోనూ తుది జట్టులో ఉన్నవారు భారీ మొత్తాన్ని అందుకోనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తేడాతో సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 71ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై భారత జట్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.