బీసీసీఐ హెచ్చరిక: భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండండి

బీసీసీఐ హెచ్చరిక: భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండండి

Updated On : April 19, 2019 / 1:06 PM IST

వరల్డ్ కప్ సాధించాలనే తాపత్రయంలో బీసీసీఐ మరోసారి కఠిన నిబంధనలకు పాల్పడింది. టీమిండియా ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్, భార్యలకు 20రోజుల పాటు దూరంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీకి క్రికెటర్లు ఎవ్వరూ తొలి 20రోజులు గర్ల్ ఫ్రెండ్స్, భార్యలకు దూరంగా ఉండాలని ఆంక్షలు విధించింది.

గతంలో వీటిపై అనుమతి తీసుకున్న కోహ్లీ కూడా ఈ నిబంధనలకు లోబడాల్సి ఉంది.  ఐపీఎల్ 2019 ముగిసిన తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం టీమిండియా మే22న ఇంగ్లాండ్‌కు బయల్దేరాల్సి ఉంది. ఈ మేర వారితో పాటు అదే బస్సులో ప్రయాణించడానికి కూడా భాగస్వాములకు అనుమతి ఇవ్వలేదు బీసీసీఐ. కేవలం ప్లేయర్లు మాత్రమే బస్సులో ప్రయాణించాలనేది రూల్.

దాదాపు భారత జట్టు ప్లేయర్లు సగం మంది పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పటి వరకూ జరిగిన విదేశీ మ్యాచ్‌లకు తమ భార్యలతో పాటు టూర్‌లకు వెళ్లడమే కాదు. అక్కడ ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. 
Also Read : KKRvsRCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌‌కతా