BCCI అంబుడ్స్‌మెన్ నోటీసులు : మొన్న గంగూలీ..నేడు సచిన్, లక్ష్మణ్

  • Published By: madhu ,Published On : April 25, 2019 / 01:35 AM IST
BCCI అంబుడ్స్‌మెన్ నోటీసులు : మొన్న గంగూలీ..నేడు సచిన్, లక్ష్మణ్

Updated On : April 25, 2019 / 1:35 AM IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ వీవీ ఎస్ లక్ష్మణ్‌లకు BCCI అంబుడ్స్‌మెన్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సచిన్ జన్మదినాన్ని జరుపుకున్నారు. వరుస పెట్టి మాజీ క్రికేటర్లకు నోటీసులు ఇవ్వడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. BCCIలో విరుద్ధ ప్రయోజనాల అంశం మరోసారి చర్చకు తెరలేపినట్లైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మోంటార్లుగా సచిన్(ముంబై), లక్ష్మణ్ (హైదరాబాద్)లు వ్యవహరిస్తున్నారు.

BCCI సలహాదారుల కమిటీ (CAC)లో సభ్యులుగా ఉంటూ..ఫ్రాంచైజీలతో కలిసి ఎలా పనిచేస్తారంటూ అంబుడ్స్‌మెన్ ప్రశ్నించింది. ఏప్రిల్ 28వ తేదీలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. భారత జట్టుకు కోచ్ నియామకంతో పాటు మరికొన్న కీలక నిర్ణయాల కోసం BCCI కొన్నేళ్ల కిందట సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా చేసిన కంప్లయింట్ మేరకు BCCI అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారి డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. 

ఇక్కడో విషయం చెప్పుకోవాలి. సీఏసీ సభ్యలుగా పనిచేస్తున్న సచిన్, లక్ష్మణ్‌లు వేతనం తీసుకోవడం లేదు. ఫ్రీగానే వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ ముంబాయి, సన్ రైజర్స్ ఫ్రాంచైజీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ కమిటీలో ఎలా కొనసాగుతారు అంటూ ప్రశ్నించింది. మరి సచిన్, లక్ష్మణ్‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.