IPL 2022 : బీసీసీఐ ముందస్తు ప్రణాళికలు, భారీ వేలం..జీతాల పెంపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు BCCI ప్రణాళికలు రచిస్తోంది. ఇందు కోసం బ్లూ ప్రింట్ రెడీ చేస్తోంది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి...సెప్టెంబర్ లో విక్రయం పూర్తి చేయాలని భావిస్తోంది. డిసెంబర్ లో భారీ వేలం నిర్వహించాలని, 2022 జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలవనుంది.

Bcci
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు BCCI ప్రణాళికలు రచిస్తోంది. ఇందు కోసం బ్లూ ప్రింట్ రెడీ చేస్తోంది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి…సెప్టెంబర్ లో విక్రయం పూర్తి చేయాలని భావిస్తోంది. డిసెంబర్ లో భారీ వేలం నిర్వహించాలని, 2022 జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలవనుంది.
Read More : Water Women : కరువు సీమలో పచ్చటి కాంతులు నింపిన మహిళ..ఐక్యరాజ్య సమితితో శభాష్ అనిపించుకున్న ఆమే ఒక సైన్యం
సంజీవ్ గోయెంకా (కోల్ కతా), అదానీ గ్రూప్ (అహ్మదాబాద్), అరబిందో ఫార్మా (హైదరాబాద్), టొరెంటో గ్రూప్ (గుజరాత్)తో సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2022 సీజన్ వేలం ముందు గరిష్టంగా నలుగురిని రీటెయిన్ చేసుకొనే అవకాశం కల్పించారు. అయితే..ఇందుకు కొన్ని షరతులు విధించారు. ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు లేదా..ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకొనే అవకాశం కల్పించారు.
Read More : Anil Kumble-CM Jagan : ఏపీ సీఎం జగన్‌ను అనిల్ కుంబ్లే అందుకే కలిశాడా?
ముగ్గురు ఆటగాళ్లను తీసుకొంటే..రూ. 15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరిని తీసుకొంటే…రూ. 12.5కోట్లు, రూ. 8.5 కోట్లు, ఒక్కరిని తీసుకొంటే..రూ. 12.5 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ. 85 నుంచి రూ. 90 కోట్లకు పెంచింది. అంటే పది ఫ్రాంచైజీల నుంచి రూ. 50 కోట్లు జమ అవుతుంది. ఇందులో ఫ్రాంచైజీలు కనీసం 75 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పది జట్లతో నిర్వహించే ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని అనుకుంటున్నారు.