BCCI : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న..మిథాలీ రాజ్, అర్జున అవార్డులకు బుమ్రా పేర్లు రికమండ్

BCCI : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న..మిథాలీ రాజ్, అర్జున అవార్డులకు బుమ్రా పేర్లు రికమండ్

Arjun Award

Updated On : June 30, 2021 / 2:59 PM IST

Khel Ratna Award : టీమిండియా ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. అంతేగాకుండా…అర్డున్ అవార్డులకు టీమిండియా మెన్స్ టీం పేస్ బౌలర్ బస్ ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లను ప్రతిపాదించారు. భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును కూడా అర్జున్ అవార్డు కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. ఈ విషయంలో తాము చర్చించడం జరిగిందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

జాతీయ క్రీడా పురస్కారాలు 2021 కోసం దరఖాస్తులను సమర్పించే లాస్ట్ డేట్ ను పొడిగించాలని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ముందే నిర్ణయించిన సంగతి తెలిసిందే. క్రీడాకారులు, కోచ్ లు, సంస్థలు, విశ్వ విద్యాలయాల నుంచి నామినేషన్లను ఆహ్వానించారు. వీటిని ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది. Manika Batra, Rohit Sharma, Vinesh Phogat, Rani Rampal, Mariyappan Phangaveluలకు ఖేల్ రత్న అవార్డులు లభించాయి. ఒకే సంవత్సరంలో ఐదుగురు అథ్లెట్లకు గౌరవం లభించడం మొదటిసారి.