IND vs SL, 2022 Tour Schedule: భారత్, శ్రీలంక జట్ల మధ్య మారిన టీ20 సిరీస్ షెడ్యూల్!
భారత్ -శ్రీలంక మధ్య టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేసి వెల్లడించింది.

Ind Vs Sri
IND vs SL, 2022 Tour Schedule: భారత్ -శ్రీలంక మధ్య టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేసి వెల్లడించింది.
శ్రీలంక క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుండగా.. ఇరు జట్ల మధ్య 3 టీ20లు, 2 టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. ముందుగా ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి టీ20 సిరీస్ నిర్వహించబోతున్నారు.
టీ20 సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 24న లక్నోలో టీమిండియా-శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాలలో రెండు, మూడో టీ20లు జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13వ తేదీ నుంచి టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కావాల్సి ఉన్నాయి.
టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే, దాని షెడ్యూల్ కూడా మారింది. భారత్-శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 4వ తేదీ నుంచి మొహాలీలో జరగనుంది. రెండో టెస్టు మార్చి 12వ తేదీ నుంచి బెంగళూరు వేదికగా జరగనుంది.
అంతకుముందు, టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 25 నుంచి, రెండవ మ్యాచ్ మార్చి 5వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. శ్రీలంక-భారత్‌ల మధ్య జరిగే టీ20, టెస్టు సిరీస్‌కు జట్టును ఇంకా ప్రకటించలేదు. భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న సిరీస్ తర్వాతే జట్లను ప్రకటించే అవకాశం ఉంది.