IPL 2024 : డీఆర్ఎస్ వివాదం.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ
హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్ 17వ సీజన్‌ను ఆరంభించిన ముంబై కాస్త కోలుకుంది.

BCCI Takes Stern Step Against Tim David Pollard Amid DRS Cheating Charges
IPL 2024 – Mumbai Indians : హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్ 17వ సీజన్‌ను ఆరంభించిన ముంబై కాస్త కోలుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించగా మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇంకో మ్యాచ్‌లో గెలుపొందింది. మొత్తంగా ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా, మూడింటిలో గెలిచింది. 6 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. ఏప్రిల్ 22న సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది ముంబై. ఈ క్రమంలోనే ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. కాగా.. ముంబై ఇండియన్స్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాకిచ్చింది. బ్యాటర్ టిమ్ డేవిడ్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌లకు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేసింది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు ప్రవర్తించిన తీరు ఐపీఎల్ నియమావళి ఉల్లంఘన కిందకు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
MS Dhoni : ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ చెప్పిన ఫ్లెమింగ్.. ఇలాగైతే తలాను చూసేది ఎలా?
డీఆర్ఎస్ వివాదం ఏంటి?
పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ డీఆర్ఎస్ విషయంలో మోసానికి పాల్పడినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ముంబై ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. అయితే.. ఆ బాల్ కాస్త అతడికి దూరంగా వెళ్లింది. ఫీల్డ్ అంపైర్లు ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు. అయితే.. ఆ సమయంలో డగౌట్‌లో కూర్చున్న టిమ్ డేవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ వైడ్ అని చెబుతూ.. డీఆర్ఎస్‌కు అడగాలని సైగలు చేశారు.
దీన్ని గమనించిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ అంపైర్ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే.. వాటిని పట్టించుకోని ఫీల్డ్ అంపైర్ డీఆర్ఎస్ కు రిఫర్ చేయగా.. థర్డ్ అంపైర్ ఆ బంతిని వైడ్ బాల్‌గా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో టిమ్‌డేవిడ్, పొలార్డ్‌లకు జరిమానా విధించారు.
LSG vs CSK : జేబులో ఏం పెట్టుకుని వచ్చావ్.. నాకు చూపించు దూబే..
For anyone watching this after the copyright claim against me, here is the timeline of the cheating with pictures:
0:08 Umpire doesnt give a wide
0:16 Tim David, Boucher, Pollard see replay
0:21 they signal team to take DRS
0:31 Sam Curran protesting pic.twitter.com/u20GUBRjBw— Ashish Sangai (@AshishFunguy) April 18, 2024