VIVO IPL In UAE: యూఏఈలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు.. బీసీసీఐ ప్రకటన!

బీసీసీఐ సమావేశంలో ఐపీఎల్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వర్చువల్‌ పద్దతిలో జరిగే సమావేశంలో... అర్థాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌పై చర్చించారు.

VIVO IPL In UAE: యూఏఈలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు.. బీసీసీఐ ప్రకటన!

Vivo Ipl In Uae

Updated On : May 29, 2021 / 4:10 PM IST

IPL 2021: బీసీసీఐ సమావేశంలో ఐపీఎల్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వర్చువల్‌ పద్దతిలో జరిగే సమావేశంలో… అర్థాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌పై చర్చించారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌‍లో మూడు వారాలపాటు యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించాలనే విషయంపైనే నిర్ణయానికి వచ్చింది బీసీసీఐ.



బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఐపిఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లు UAEలో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధృవీకరించారు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను UAEలో నిర్వహించనుండగా.. దీనికి సంబంధించి షెడ్యూల్ త్వరలో విడుదల చేయనుంది బీసీసీఐ.



గత చాలా రోజులుగా, ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈలో జరుగుతుంది అని వార్తలు రాగా.. ఇప్పటివరకు బీసీసీఐ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్‌గా దీనిపై క్లారిటీ వచ్చింది. ఇదే సమయంలో ఐసీసీ వరల్డ్ కప్ విషయంలో మాత్రం కాస్త సమయం ఇవ్వాలని ఐసీసీని కోరాలని నిర్ణయించింది.



ఐపీఎల్ సీజన్ 14 మిగిలిన మ్యాచ్‌లను బిసిసిఐ నిర్వహించకపోతే, సుమారు మూడు వేల కోట్ల రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే టోర్నీ నిర్వహణకే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.