Team India New Jersey: టీ20 వరల్డ్‌కప్‌కోసం టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది..

భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది.

Team India New Jersey: టీ20 వరల్డ్‌కప్‌కోసం టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది..

Team India New Jersey

Updated On : September 18, 2022 / 10:00 PM IST

Team India New Jersey: భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే 2022 టీ20 ప్రపంచ కప్‌కు ఒక నెల ముందు, ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు రెండు రోజుల ముందు ఈ కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. అయితే ఈ జెర్సీని టీమిండియా ఆటగాళ్లు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ నుంచే ధరించనున్నారు.

Team India World Record : టీమిండియా వరల్డ్ రికార్డ్.. ఒకే ఏడాదిలో అత్యధిక వన్డే సిరీస్‌లు వైట్ వాష్

బీసీసీఐ విడుదల చేసిన కొత్త జెర్సీకి సంబంధించిన ఫోస్టర్ లో వరుసగా పురుషులు, మహిళల జట్టు కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్‌కౌర్ ఉన్నారు. వారిపక్కన సూర్యకుమార్ యాదవ్, షపాలీ వర్మ, హార్ధిక్ పాండ్యా, రేణుకా సింగ్ ఉన్నారు.

బీసీసీఐ కొత్తగా విడుదల చేసిన జెర్సీ 2007 టీ20 వరల్డ్ కప్ లో భారత్ జెర్సీకి దగ్గరగా ఉంది. 2020లో ఎంపీఎల్-బీసీసీఐల మధ్య ఒప్పందం కుదిరాక రూపొందించబడిన మూడో జెర్సీ ఇది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది. చేతులు, షోల్డర్ డార్క్ బ్లూ కలర్ లో ఉండగా, జెర్సీపై గీతలు వచ్చాయి.