Team India World Record : టీమిండియా వరల్డ్ రికార్డ్.. ఒకే ఏడాదిలో అత్యధిక వన్డే సిరీస్‌లు వైట్ వాష్

భారత క్రికెట్ జట్టు జోరు మీదుంది. టీమిండియా విజయాల పరంపర కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Team India World Record : టీమిండియా వరల్డ్ రికార్డ్.. ఒకే ఏడాదిలో అత్యధిక వన్డే సిరీస్‌లు వైట్ వాష్

Team India World Record : భారత క్రికెట్ జట్టు జోరు మీదుంది. టీమిండియా విజయాల పరంపర కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే ఏడాదిలో అత్యధిక వన్డే సిరీస్ లు వైట్ వాష్ చేసిన జట్టుగా భారత్ ఘనత సాధించింది. 2022లో టీమిండియా మూడు వన్డే సిరీస్ లు వైట్ వాష్ చేసింది. జింబాబ్వేతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో భారత్ ఈ ఘనత సాధించింది. ఇంతకుముందు వెస్టిండీస్‌తో రెండు వన్డే సిరీస్‌లను భారత్‌ వైట్‌వాష్‌ చేసింది. న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ జట్లు.. ఈ ఏడాది రెండు వన్డే సిరీస్‌లను వైట్‌వాష్‌ చేశాయి.

జింబాబ్వేపై సోమవారం జరిగిన నామమాత్రపు మూడో వన్డేలోనూ భారత్ నెగ్గింది. ఉత్కంఠ పోరులో 13 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. కాగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. 290 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రజా (115) సెంచరీతో కదంతొక్కాడు.

రజా రెచ్చిపోయి ఆడటంతో ఓ దశలో జింబాబ్వే విజయానికి చేరువగా వచ్చింది. అయితే రజా ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. టీమిండియా బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశాడు.

గిల్ మెరుపు శతకం..

అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మాన్ గిల్ (130) అద్భుతంగా ఆడాడు. మెరుపు సెంచరీ బాదాడు. గిల్ సెంచరీతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గిల్ కే దక్కింది. గిల్ కు తన కెరీర్ లో ఇదే తొలి సెంచరీ.

 

వన్డే సిరీస్ క్లీన్ స్వీప్