Ben Duckett: ఇంగ్లాండ్ ఓపెనర్ ధాటికి 93 ఏళ్ల రికార్డు బద్దలు
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకౌట్(Ben Duckett) అరుదైన రికార్డు నెలకొల్పాడు. సొంత గడ్డపై ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 93 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

Ben Duckett-Don Bradman
Ben Duckett-Don Bradman: ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకౌట్(Ben Duckett) అరుదైన రికార్డు నెలకొల్పాడు. సొంత గడ్డపై ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 93 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 178 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 182 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్(Don Bradman) నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాను భయపెడుతున్న చెత్త రికార్డు
లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత ను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఘనత బ్రాడ్‌మన్ పేరిట ఉండేది. 1930లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 160 బంతుల్లోనే 150 పరుగులు చేయగా.. బెన్ డకెట్ మాత్రం 150 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (176 బంతులు), రాబ్ కీ (181 బంతులు) ఉన్నారు.
ఓవరల్‌గా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఉన్నాడు. శ్రీలంకతో 2014లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ 103 బంతుల్లో 150 పరుగులు చేశాడు. మెక్‌కల్లమ్ తరువాత జయవర్థనే (111 బంతుల్లో), రాయ్ ఫ్రెడ్రిక్స్(113 బంతుల్లో), హ్యారీ బ్రూక్(115 బంతుల్లో) ఉన్నారు.