Delhi Capitals : ఐపీఎల్‌కు స‌న్న‌ద్ధం అవుతున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్‌

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది.

Delhi Capitals : ఐపీఎల్‌కు స‌న్న‌ద్ధం అవుతున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్‌

Harry Brook pulls out of IPL 2024

Delhi Capitals – Harry Brook : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 మ‌రో తొమ్మిది రోజుల్లో ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కూడా ఈ సీజ‌న్ కోసం స‌న్నద్ధం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఇటీవ‌ల జ‌రిగిన మినీ వేలంలో రూ.4కోట్లు పోసి కొన్న ఇంగ్లాండ్ యువ ఆట‌గాడు హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 17వ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అత‌డు ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

భార‌త్‌తో జ‌రిగిన ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ నుంచి సైతం బ్రూక్ ఆఖ‌రి నిమిషంలో త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. కుటుంబ కార‌ణాల‌తో అత‌డు ఈ సిరీస్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఐపీఎల్ 2023లో బ్రూక్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.13.23 కోట్లు కు కొనుగోలు చేసింది.

Ravichandran Ashwin : అమ్మ కుప్ప‌కూలిపోయింది.. మాట్లాడే ప‌రిస్థితుల్లో లేద‌ని డాక్ట‌ర్ చెప్పాడు : అశ్విన్

Harry Brook

Harry Brook

అత‌డి పై ఉన్న న‌మ్మ‌కంతో ఎస్ఆర్‌హెచ్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేయ‌గా ఆ సీజ‌న్‌లో బ్రూక్ దారుణంగా విఫ‌లం అయ్యాడు. 11 మ్యాచులు ఆడిన అత‌డు 190 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో సీజ‌న్ ముగిసిన త‌రువాత ఎస్ఆర్‌హెచ్ అత‌డిని విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ.4కోట్ల‌కు ద‌క్కించుకుంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజ‌న్ ఆరంభం కాక‌ముందే ఇద్ద‌రు ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు ఈ టోర్నీకి దూరం అయ్యారు. రెండు రోజుల క్రితం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జేస‌న్ రాయ్ దూరం వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూరం కాగా తాజాగా బ్రూక్ అదే బాట‌లో న‌డిచాడు.