LSG : గెలుపు జోష్‌లో ఉన్న లక్నోకు భారీ షాక్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్టార్ ప్లేయర్ ఔట్..
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అదరగొడుతోంది.
Big shock to LSG Wanindu Hasaranga Ruled Out Of IPL 2026
- లక్నోకు బిగ్ షాక్
- గాయం నుంచి కోలుకోని వనిందు హసరంగ
- ఈ సీజన్ నుంచి ఈ స్టార్ శ్రీలంక క్రికెటర్ ఔట్
LSG : ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న లక్నోకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు.
గాయం కారణంగా ఇప్పటి వరకు అతడు జట్టుతో చేరలేదు. ఇక పై రావడం కూడా కష్టమేనని సమాచారం. ఈ నేపథ్యంలో లక్నో యాజమాన్యం అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వేట మొదలు పెట్టింది. ఎల్ఎస్జి క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. 24 నుంచి 48 గంటల్లో ప్రత్యామ్నాయ ప్లేయర్ ఎవరనేది ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
Babar Azam : టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్.. క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీల రికార్డులు బ్రేక్..
టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లో ఎడమ కాలి తొడకండరాల గాయానికి గురైయ్యాడు హసరంగ. ఆ తరువాత నుంచి అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ సమయానికి అతడు కోలుకుంటాడని భావించారు.
అదే సమయంలో ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఫిట్నెస్ పరీక్షలు తప్పని సరి చేసింది. ఈ ఫిట్నెస్ టెస్టులు పాసైన వారికే ఎన్ఓసీ ఇస్తోంది. ఈ ఫిట్నెస్ పరీక్షలకు కూడా హసరంగ దరఖాస్తు చేసుకోలేదని వార్తలు వస్తున్నాయి.
హసరంగను లక్నో జట్టు గత వేలంలో 2 కోట్ల మొత్తానికి దక్కించుకుంది. ఈ సీజన్‌కు అతడు దూరం కావడంతో దక్షిణాఫ్రికాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జార్జ్ లిండేను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా.. ఐపీఎల్లో ఇప్పటి వరకు లిండే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వివిధ లీగుల్లో సత్తా చాటాడు. ఒకవేళ హసరంగ స్థానంలో లక్నో అతడిని ఎంపిక చేస్తే.. ఈ సీజన్లోనే అతడు ఐపీఎల్ అరంగ్రేటం చేయొచ్చు.
