ODI World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు దూరం

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు ద‌క్షిణాఫ్రికా(South Afirca)కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

ODI World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు దూరం

Anrich Nortje-Sisanda Magala

ODI World Cup : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు ద‌క్షిణాఫ్రికా(South Afirca)కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్లు అన్రిచ్ నోర్జే (Anrich Nortje), సిసింద మ‌గాల (Sisanda Magala) ప్ర‌పంచ‌క‌ప్‌కు దూరం అయ్యారు. ప్ర‌పంచ‌క‌ప్ కోసం ప్ర‌క‌టించిన 15 మంది ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో వీరిద్ద‌రు ఉన్నారు. గాయాల కార‌ణంగానే వీరిద్ద‌రు త‌ప్పుకున్న‌ట్లు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. వీరి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌ల‌ను తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఇటీవ‌ల ముగిసిన ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌లోనే వీరిద్ద‌రికి గాయాలు అయ్యాయి. రెండో వ‌న్డేలో అన్రిచ్‌ నోర్జే వెన్నునొప్పితో మైదానాన్ని వీడగా మూడో వ‌న్డేలో మ‌గాలా ఎడ‌మ మోకాలికి గాయ‌మైంది. ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యానికి వీరిద్ద‌రు కోలుకునే అవ‌క‌శాలు లేవ‌ని వైద్యులు తెలిపారు. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో అన్రిచ్, సిసింద లు దూరమవడం చాలా నిరాశపరిచింద‌ని దక్షిణాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ అన్నారు. వాళ్లిద్ద‌రూ మ‌రింత బ‌లంగా తిరిగి వ‌స్తార‌ని భావిస్తున్న‌ట్లు చెప్పాడు.

కాగా.. దక్షిణాఫ్రికా జ‌ట్టు శనివారం భారత్‌కు రానుంది. సెప్టెంబ‌ర్ 29న అప్గానిస్తాన్‌తో, అక్టోబ‌ర్ 2న న్యూజిలాండ్‌తో వార్మ‌ప్ మ్యాచులు ఆడ‌నుంది. ఇక ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న తొలి మ్యాచ్‌ను ఢిల్లీ వేదిక‌గా అక్టోబ‌ర్ 7న శ్రీలంక‌తో ఆడ‌నుంది.

దక్షిణాఫ్రికా వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే :

టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్ (వికెట్ కీప‌ర్‌), రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, కగిసో రబడా, తబ్రైజ్ షంసీ, లిజాడ్ విలియమ్స్

ODI World Cup 2023 : ఉప్పల్‌లో ప్ర‌పంచ‌క‌ప్‌ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం..!