Jasprit Bumrah : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో ఒకే ఒక్క‌డు..

టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Jasprit Bumrah : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో ఒకే ఒక్క‌డు..

Bumrah Breaks ashwin Record Of Most Five Wicket Hauls In World Test Championship

Updated On : July 12, 2025 / 8:32 AM IST

టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ)లో అత్య‌ధిక సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. లండ‌న్‌లోని లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు ప‌డ‌గొట్టి బుమ్రా ఈ ఘ‌న‌త సాధించాడు.

డ‌బ్ల్యూటీసీ చ‌రిత్ర‌లో బుమ్రాకు ఇది 12వ సారి ఐదు వికెట్లు ప్ర‌ద‌ర్శ‌న‌. ఈ క్ర‌మంలో అత‌డు టీమ్ఇండియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ రికార్డును బ్రేక్ చేశాడు. డ‌బ్ల్యూటీసీలో అశ్విన్ 11 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. వీరిద్ద‌రి త‌రువాత పాట్ క‌మిన్స్‌, నాథ‌న్ లియోన్ త‌దిత‌రులు ఉన్నారు.

బుమ్రా దెబ్బకు బిత్తరపోయిన జో రూట్.. పాపం.. బాల్ వికెట్లను ఎలా తాకిందో అర్ధంకాక ఏం చేశాడంటే.. వీడియో వైరల్..

డ‌బ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక‌సార్లు ఐదు వికెట్లు సాధించిన బౌలర్లు వీరే..

జస్ప్రీత్ బుమ్రా (భారత్) – 12 సార్లు
రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 11 సార్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 10 సార్లు
నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) – 10 సార్లు
ప్రభాత్ జయసూర్య (శ్రీలంక) – 9 సార్లు
కగిసో రబాడ (ద‌క్షిణాఫ్రికా) – 8 సార్లు..

ENG vs IND : పది ఓవర్లకే ఆకృతి కోల్పోయిన డ్యూక్‌ బంతి.. మరింత పాత బాల్ ఇచ్చార‌న్న సిరాజ్‌..

పాట్‌ కమిన్స్ రికార్డ్ బద్దలు..

ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోరూట్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన బౌల‌ర్‌గానూ బుమ్రా నిలిచాడు. లార్డ్స్ టెస్టులో రూట్‌ను క్లీన్ బౌల్ట్ చేయ‌డం ద్వారా ఈ ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో రూట్‌ను ఔట్ చేయ‌డం బుమ్రాకు ఇది 11వ సారి కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15వ సారి. ఇక పాట్ క‌మిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో జోరూట్‌ను 14సార్లు ఔట్ చేశాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు జోరూట్‌ను ఔట్ చేసిన బౌల‌ర్లు వీరే..
జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 15 సార్లు
పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 14 సార్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 13 సార్లు
ర‌వీంద్ర జ‌డేజా (భార‌త్‌) – 13 సార్లు
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్‌) – 12 సార్లు