Rishabh Pant: “ఫస్ట్ గేమ్ కే అతణ్ని నిందించడం కరెక్ట్ కాదు”

తన జట్టు ప్లేయర్ మిచెల్ మార్ష్‌కు సపోర్ట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 16పరుగుల తేడా.

Rishabh Pant: “ఫస్ట్ గేమ్ కే అతణ్ని నిందించడం కరెక్ట్ కాదు”

Rishab Pant

Updated On : April 17, 2022 / 12:41 PM IST

Rishabh Pant: తన జట్టు ప్లేయర్ మిచెల్ మార్ష్‌కు సపోర్ట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 16పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఈ గేమ్‌లో మిచెల్ మార్ష్ ప్రదర్శన పట్ల అంతటా విమర్శలు వెల్లువెత్తాయి. స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బందిపడుతుంటే కావాలసిన రన్ రేట్ కూడా అమాంతం పడిపోయింది.

గాయం నుంచి కోలుకున్న మార్ష్.. అప్పటికే 24బాల్స్ ఆడి 14వ ఓవర్ లాస్ట్ బాల్‌కు అవుట్ అయిపోయాడు. 190 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా జరిగిన ఇన్నింగ్స్ లో మార్ష్ క్రీజులో ఉన్న సమయం చాలా విలువైనదని విమర్శకుల భావన. తొలి ఐదు ఓవర్లలో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా 50పరుగుల వరకూ నమోదు చేశారు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో మార్ష్ ప్రదర్శన ఫలితంగా జట్టుకు చేధన మరింత కష్టమైంది.

ఈ ప్రదర్శనను ఆధారంగా చేసుకుని మిచెల్ మార్ష్ ను నిందించడం కరెక్ట్ కాదని.. ఈ సీజన్ లో తాను ఆడిన తొలి మ్యాచ్ అని ఢిల్లీ కెప్టెన్ అంటున్నాడు. “మార్ష్ ను నిందించలేం. సీజన్ లో అతనితో తొలి మ్యాచ్ ఆడించాం. ఆ సమయంలో మంచి ప్రదర్శన చేసి ఉంటే బాగుండేది. ఇన్నింగ్స్ పెరుగుతున్న కొద్దీ మైదానం మరింత అనుకూలంగా మారింది కూడా” అని మ్యాచ్ అనంతరం జరిగిన సమావేశంలో పంత్ వెల్లడించాడు.

Read Also : ఇలా ఆడితే ఎప్పటికీ సాధించలేవు.. రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ వార్నింగ్..!

ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ పోరులో ఆల్ రౌండ్ షో తో బెంగళూరు అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితమైంది. దీంతో బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది.