Champions League T20: ఛాంపియన్స్ లీగ్ టీ20 మళ్లీ వచ్చేస్తోంది..! ఎప్పటి నుంచి అంటే..
టీ20 ఛాంపియన్స్ లీగ్ చివరి సీజన్ 2014లో జరిగింది. చివరి సీజన్‌ను ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది.

Champions League T20: ఛాంపియన్స్ లీగ్ టీ20 రీ లాంచ్ కాబోతోంది. 2026 సెప్టెంబర్‌లో ఈ లీగ్ ను మరోసారి నిర్వహించే అవకాశం ఉంది. సింగపూర్‌లో ICC వార్షిక సమావేశం జరిగింది. ఇందులో ఛాంపియన్స్ లీగ్ టీ20 రీ లాంచ్ గురించి డిస్కషన్ జరిగింది. ఈ టోర్నీ పునరుద్ధరణకు కీలక సభ్య దేశాలు మద్దతు తెలిపినట్లు సమాచారం. దీంతో ఛాంపియన్స్ లీగ్ T20 వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. 2009 నుంచి 2014 వరకు మొత్తం 6 సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. ఆ తర్వాత ఈ టోర్నీని రద్దు చేశారు.
టీ20 ప్రపంచ కప్ జరిగిన ఏడాది తర్వాత ఈ మెగా టోర్నీని నిర్వహించారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులకు చెందిన వివిధ రకాల క్లబ్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. IPL, బిగ్ బాష్ లీగ్, దక్షిణాఫ్రికా T20 ఛాలెంజ్, ఇంగ్లాండ్ T20 బ్లాస్ట్ నుండి జట్లు ఈ టోర్నీలో ఆడాయి. అలాగే శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లలో జరిగిన T20 పోటీల నుండి ఒక్కొక్క జట్టు ఉన్నాయి.
ఒక దశాబ్దం తర్వాత, వెస్టిండీస్‌లో CPL ఒక భారీ ఒప్పందంగా మారింది, ఇంగ్లాండ్ వారి రెండు షార్ట్-ఫామ్ టోర్నమెంట్‌లు సమాంతరంగా జరుగుతున్నాయి, అయితే ప్రేక్షకులు, స్పాన్సర్లు మరియు ఆటగాళ్ళు దక్షిణాఫ్రికాలో SA20కి చేపలు పట్టినట్లు వచ్చారు. CLT20 చివరిసారిగా 2014లో ఆడారు; అయితే, దాని పునరాగమనం అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ కోసం FTPని కూడా ప్రభావితం చేస్తుంది.
Also Read: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్.. భారత జట్టులో నాలుగు మార్పులు? మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు..!
టీ20 ఛాంపియన్స్ లీగ్ చివరి సీజన్ 2014లో జరిగింది. చివరి సీజన్‌ను ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది. ఐసీసీ సమావేశంలో ఛాంపియన్స్ లీగ్ టీ20 తిరిగి తీసుకురావడంపై సభ్యుల మధ్య చర్చ జరిగిందని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది. ఐసీసీ సభ్యులు ఈ టీ20 టోర్నమెంట్‌ను మళ్లీ ప్రారంభించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
2009లో ప్రారంభించబడిన ఛాంపియన్స్ లీగ్ టీ20.. ఫుట్‌బాల్ UEFA ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ వెర్షన్‌గా పరిగణించబడింది. అగ్ర టీ20 లీగ్‌ల విజేతలు ఈ టోర్నమెంట్‌లో ఆడారు. 2009 నుంచి 2014 వరకు 6 సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించగా.. 2 సార్లు చెన్నై సూపర్ కింగ్స్, 2 సార్లు ముంబై ఇండియన్స్ విజేతలుగా నిలిచాయి. ఆస్ట్రేలియా జట్లు న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్లు ఒక్కోసారి విజేతగా నిలిచాయి. చివరిసారిగా ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో ఐపీఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. సీఎస్ కే విన్నర్ గా నిలిచింది.