IND vs AUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఓడిపోవడం మంచిదే అన్న రోహిత్ శర్మ..
సెమీస్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది.

PIC Credit @ BCCI TWITTER
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. కాగా.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం వరుసగా ఇది 11వ సారి కాగా.. భారత జట్టు వరుసగా టాస్‌లు ఓడిపోవడం ఇది 14వ సారి.
‘పిచ్ చూడడానికి బాగుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ప్లేయర్లు సెమీస్ కోసం చక్కగా సిద్ధం అయ్యారు. తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కొన్నోలీ, జాన్సన్ స్థానంలో సంఘా ఆడుతున్నారు.’ అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.
🚨 Toss News 🚨
Australia have elected to bat against #TeamIndia in the #ChampionsTrophy Semi-Final!
Updates ▶️ https://t.co/HYAJl7biEo#INDvAUS pic.twitter.com/tdkzvwJfyu
— BCCI (@BCCI) March 4, 2025
‘నేను రెండింటికి సిద్ధం అయ్యాను. అయితే.. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాలా అనే విషయంలో కాస్త సంధిగ్దంలో ఉన్నాను. ఇలాంటి సమయాల్లో టాస్ ఓడిపోవడం మంచిదే. పిచ్ మారుతోంది. మేము గత మూడు మ్యాచ్‌ల్లో చాలా మంచి క్రికెట్ ఆడాడు. ఈ రోజు ఛాలెంజింగ్‌గా ఉండనుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేవు. న్యూజిలాండ్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాము. టాస్ ఓడిపోవడంతో మేము తొలుత బౌలింగ్ చేయనున్నాము. ఆసీస్‌ను ఎంత తక్కువకు వీలైతే అంత తక్కువ స్కోరుకు పరిమితం చేయాలని భావిస్తున్నాము. ‘అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు..
కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
🚨 A look at #TeamIndia‘s Playing XI 🔽
Updates ▶️ https://t.co/HYAJl7biEo#INDvAUS | #ChampionsTrophy pic.twitter.com/kFeikS3w7b
— BCCI (@BCCI) March 4, 2025
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.