Champions Trophy: కొత్త జెర్సీలతో భారత్ ఆటగాళ్లు.. జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుబాయ్ కు చేరుకున్నభారత జట్టు..

Champions Trophy: కొత్త జెర్సీలతో భారత్ ఆటగాళ్లు.. జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ

Team India new jersey

Updated On : February 18, 2025 / 11:33 AM IST

Champions Trophy: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుబాయ్ కు చేరుకున్న జట్టు ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఈనెల 19 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఈనెల 20వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. అయితే, తాజాగా.. టీమిండియా ప్లేయర్లు కొత్త జెర్సీల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

Also Read: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా నుంచి హయ్యస్ట్ రన్స్ చేసిన టాప్ 5 తోపులు వీళ్లే…

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ తోపాటు రిషబ్ పంత్, మహ్మద్ షమీ తదితర ప్లేయర్లు తాము ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమంటూ కొత్త జెర్సీలతో ఫోజులిచ్చారు. అయితే, టీమిండియా ఆటగాళ్లు ధరించిన జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ గత కొద్దిరోజుల క్రితమే క్లారిటీ ఇచ్చింది.

Also Read: IPL 2025: పాండ్యా ఔట్.. ముంబై పగ్గాలు మళ్లీ రోహిత్ కి.. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో..

గతంలో పలువురు అభిమానులు భారత జెర్సీలపై పాకిస్థాన్ పేరును తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. టోర్నమెంట్ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు ఐసీసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని, భారత జెర్సీలపై పాక్ పేరును తొలగించాలని మేము ఐసీసీని కోరలేమని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. జెర్సీలపై ఉండే ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ కు హక్కు ఉందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 

ఇదిలాఉంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెండాకు అవమానం జరిగిందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా టోర్నీలో పాల్గొనే దేశాల జాతీయ జెండాలను ఎగురవేశారు. అయితే, భారత్ జెండాను మాత్రం ప్రదర్శించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భారత జెండా లేకపోవడంపై వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్థాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాలు స్పందించాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ లు ఆడేందుకు పాక్ కు టీమిండియా రావట్లేదు.. కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో మ్యాచ్ లు ఆడుతున్న జట్ల జెండాలను మాత్రమే ఎగరవేశామని పేర్కొంది. భారత్ తన మ్యాచ్ ల్ని దుబాయ్ లో ఆడుతుంది. బంగ్లాదేశ్ జట్టు తన తొలి మ్యాచ్ దుబాయ్ లో ఆడాల్సి ఉండటంతో పాకిస్థాన్ కు ఇంకా చేరుకోలేదు. దీంతో ఆ రెండు జట్ల జెండాలు ఎగురవేయలేదని పీసీసీ వర్గాలు తెలిపారు.