Ind vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్.. పిచ్ ఎలా ఉందంటే..? అలా ఆడినోళ్లే ఛాంపియన్స్ అవుతారా..

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.

Ind vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్.. పిచ్ ఎలా ఉందంటే..? అలా ఆడినోళ్లే ఛాంపియన్స్ అవుతారా..

IND vs NZ

Updated On : March 9, 2025 / 8:19 AM IST

Champions Trophy 2025 Final IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ నెగ్గి అదిరే ఫామ్ లో ఉన్న టీమిండియా ఇవాళ జరిగే ఫైనల్లోనూ విజేతగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో విజయంతో భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకోవాలని చూస్తుండగా.. న్యూజిలాండ్ జట్టు రెండోసారి టైటిల్ ను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.

Also Read: Champions Trophy: ప్రాక్టీస్ లో కోహ్లీకి గాయం.. పాకిస్తాన్ మీడియాలో వార్తలు.. ఫైనల్ కి ముందు..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన పిచ్ నే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం చేశారు. పిచ్ మందకొడిగా ఉంటుంది. ఈ పిచ్ పై స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ పిచ్ పై బ్యాటర్లు పరుగులు చేయడం అంతఈజీ కాదు. ఇక్కడ ప్రారంభంలో వేగంగా పరుగులు సాధించగలిగినప్పటికీ మిడిల్ ఆర్డర్ లో సింగిల్స్, డబుల్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తే పరుగులు రాబట్టే అవకాశం ఉంది.

Also Read: Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైన‌ల్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న ప‌లు రికార్డులు ఇవే..

దుబాయ్ లో మంచు ప్రభావం ఉండదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకునే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ పరుగులను ఛేదించడం అంత కష్టం కాకపోయినా ముందుగా బ్యాటిగ్ చేసిన జట్టు 290 నుంచి 300 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన జట్టు లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమనే చెప్పొచ్చు. ఇవాళ జరిగే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 270 నుంచి 280 పరుగులు చేసినా మంచి స్కోరే అవుతుంది.


ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్లో టీమిండియానే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దుబాయ్ లో జరిగిన టోర్నమెంట్ లోని అన్ని మ్యాచ్ లను టీమిండియా ఆడి గెలిచింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో రాణిస్తున్నారు. గత మ్యాచ్ లో కోహ్లీ మాట్లాడుతూ.. తాను సింగిల్స్, డబుల్స్ పై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందని తనకు తెలుసునని, అందుకే 84 పరుగులు చేయగలిగానని చెప్పాడు. ఇవాళ్టి మ్యాచ్ లో కోహ్లీ అదే ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. ఇకపోతే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో రాణిస్తే భారత్ జట్టు విజయావకాశాలు మరింత మెరుగవుతాయి.


మరోవైపు భారత్ బౌలర్లుకూడా రాణిస్తున్నారు. లీగ్ దశలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా రాణిస్తున్నారు. పేసర్ మహ్మద్ షమీ, హార్డిక్ పాండ్యాలు కూడా ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నారు. భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉండటంతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం ఖాయమని అభిమానులు ధీమాతో ఉన్నారు.


తుది జట్లు (అంచనా)
భారత్ జట్టు : రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మమద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ జట్టు : విల్ యంగ్, రచన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్, శాంట్నర్, జేమీసన్, హెన్రీ లేదా డఫి, ఒరూర్క్.