Champions Trophy: ప్రాక్టీస్ లో కోహ్లీకి గాయం.. పాకిస్తాన్ మీడియాలో వార్తలు.. ఫైనల్ కి ముందు..
ఛాంపియన్స్ ట్రోఫీలోని అన్ని మ్యాచుల్లోనూ అదరగొట్టి ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేళ భారత ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో నెట్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయని పాకిస్థాన్ జియో న్యూస్ తెలిపింది.
పాకిస్థాన్ జియో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. నెట్స్‌లో ఓ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోహ్లీ మోకాలికి బాల్ తగిలింది. దీంతో అతడు ప్రాక్టీస్ ఆపేశాడు. అనంతరం కోహ్లీ వద్దకు వెంటనే భారత్‌కు చెందిన ఫిజియోథెరపిస్టులు వచ్చారు. కోహ్లీ మోకాలిపై స్ప్రే కొట్టి ఫిజియోథెరపిస్టులు ప్రాథమిక చికిత్స చేశారు.
కోహ్లీకి గాయం వల్ల స్వల్ప నొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికీ, ప్రాక్టీసు సెషన్ వద్దే ఉండి తోటి ఆటగాళ్లు సాధన చేస్తున్న తీరును అతడు చూశాడు. కోహ్లీకి గాయం కావడంతో అతడు ఆడతాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అది స్వల్పగాయమేనని, కోహ్లీ ఫైనల్‌లో ఆడతాడని కోచ్‌లు అన్నట్లు తెలిసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలోని అన్ని మ్యాచుల్లోనూ అదరగొట్టి ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. విరాట్ కోహ్లీ బాగా రాణిస్తుండడంతో ఫైనల్ మ్యాచులోనూ అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
మరోవైపు, ఫైనల్ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ ప్రాక్టీస్ చేసింది. భారత్‌తో గ్రూప్ దశలో జరిగిన మ్యాచులో తమకు ఎదురైన ఓటమితో ఎన్నో నేర్చుకున్నామని ఆ టీమ్ సభ్యులు అంటున్నారు. ఆ అనుభవంతో ఫైనల్‌లో భారత్‌పై పై చేయి సాధించేందుకు ప్రణాళికలు వేసుకున్నామని చెబుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఒకే ఒక్క మ్యాచులో ఓడిపోయింది. అదీ భారత్‌తో జరిగిన మ్యాచే. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నలుగురు స్పిన్నర్లను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం శాంట్నర్, బ్రేస్‌వెల్ వంటి స్పిన్నర్లు ఉన్నారు.
ఇక రచిన్ రవీంద్రతో పాటు గ్లెన్ ఫిలిప్స్ అప్పుడప్పుడు స్పిన్‌తో అదరగొడుతున్నారు. దీంతో మరో స్పిన్నర్ మార్క్ చాప్‌మన్‌ను తీసుకుందామని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత బ్యాటర్లు ఇటీవల కాలంలో స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు పడుతున్నారు.