IPL 2021 : సూపర్ ఫైట్, ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్

ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్‌లో సూపర్‌ ఫైట్‌ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్‌ పంత్‌.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది.

IPL 2021 : సూపర్ ఫైట్, ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్

CSK vs DC

Updated On : April 10, 2021 / 10:55 AM IST

Chennai Super Kings vs Delhi Capitals : ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్‌లో సూపర్‌ ఫైట్‌ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్‌ పంత్‌.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే.. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పంత్‌ తలపడనున్నాడు. యువరక్తంతో ఢిల్లీ ఉరకలేస్తుంటే.. సీనియర్‌ సైన్యంతో డాడీస్‌ ఆర్మీ సమరానికి సిద్ధమైంది. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేక పరాభవాన్ని గత సీజన్‌లో చవిచూసిన ధోనీసేన మళ్లీ పుంజుకోవాలని కసిగా ఉంటే.. గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన క్యాపిటల్స్‌ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది.

ఇక ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో కోహ్లీ సేన బోణీ కొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి ఛేదించి విక్టరీ కొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌ ప్రారంభించిన బెంగుళూరు ఎక్కడ తడబడకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లింది. డివిలియర్స్‌ 48, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 39 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన సమయంలో హర్షల్‌ పటేల్‌ మ్యాచ్‌ను గెలిపించాడు.

Read More : West Bengal Assembly Election : వెస్ట్ బెంగాల్ ఎన్నికలు 4వ దశ..పోలింగ్ ప్రారంభం