రాణించిన ఆయుష్, డెవాల్డ్ బ్రెవిస్.. ఆర్ఆర్ టార్గెట్‌ ఎంతంటే?

ఆర్ఆర్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్ మూడేసి వికెట్లు తీశారు.

రాణించిన ఆయుష్, డెవాల్డ్ బ్రెవిస్.. ఆర్ఆర్ టార్గెట్‌ ఎంతంటే?

PIC: @IPL (X)

Updated On : May 20, 2025 / 9:32 PM IST

ఐపీఎల్‌ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

చెన్నై బ్యాటర్లలో ఆయుష్ 43, డెవాన్ కాన్వే 10, ఉర్విల్ పటేల్ 0, రవిచంద్రన్ అశ్విన్ 13, రవీంద్ర జడేజా 1, డెవాల్డ్ బ్రెవిస్ 42, శివం దూబే 39, ఎంఎస్ ధోని 16, అన్షుల్ కాంబోజ్ 5 (నాటౌట్), నూర్ అహ్మద్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.

ఆర్ఆర్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్ మూడేసి వికెట్లు, తుషార్ దేశ్‌పాండే, వనిందు హసరంగా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

చెన్నై జట్టు
ఆయుష్, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని, అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్

రాజస్థాన్ రాయల్ జట్టు
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, యుధ్వీర్ సింగ్ చరక్, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్