2024 Chess roundup : ప్రపంచ చదరంగంలో మనమే మేటి.. అటు గుకేశ్.. ఇటు కోనేరు హంపి..
2024 భారత క్రీడారంగంలో మరోసారి మన మేధస్సు ఎంత గొప్పదో చాటి చెప్పింది.

Chess roundup 2024 Gukesh Dommaraju and Koneru Humpy greatest victories
2024 భారత క్రీడారంగంలో మరోసారి మన మేధస్సు ఎంత గొప్పదో చాటి చెప్పింది. చెస్ అంటే మైండ్ గేమ్..ఏకకాలంలో అవతలివారి ఎత్తుని..దానికి పై ఎత్తు..ఆ తర్వాత వచ్చే మూవ్‌ని అంచనా వేసి ఆడే ఆట..అంత తొందరగా వంటబట్టని..ఈ గేమ్‌లో రాజైనా…రాణైనా మనమే అని మరోసారి నిరూపించింది 2024. అటు గుకేశ్..ఇటు కోనేరు హంపి..ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించి శభాష్ అనిపించారు.
ఏడేళ్ల వయసు నుంచే 64 గడుల యుద్ధక్షేత్రాన్ని ఔపోశన పట్టిన గుకేశ్. తొమ్మిదేళ్లకే స్కూల్ చెస్ ఛాంపియన్ గా నిలవగా ఇపుడు రారాజుగా ఔరా అనిపించాడు. సైన్యాన్ని సరైన సమయంలో, సరైన రీతిలో కదపడమే కాదు..చెక్ చెప్పడంలోనూ దిట్టగా నిలిచి భారతపతాకాన్ని రెపరెపలాడించాడు. అంతేకాదు ఆ ఘనత సాధించిన మరో తెలుగు యువకుడిగా రికార్డులెక్కాడు. ఈ సందర్భంగా గుకేశ్‌కి ప్రధానమంత్రి నుంచి రజనీకాంత్ లాంటి స్టార్ల వరకూ ప్రశంసలు వెల్లువెత్తాయ్. అత్యంత చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్‌గా మారిన గుకేశ్ ఉదంతం 2024లో భారత క్రీడారంగంలో హైలైట్.
IND vs AUS 4th test : నాలుగో టెస్టులో భారత్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం..
ఇక మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌ని కూడ కైవసం చేసుకున్న కోనేరు హంపి.. మరోసారి ఆ ఘనత సాధించింది. గతంలోనే అనేకసార్లు చెస్ ఛాంపియన్‌గా ఆమెకి ఉన్న పేరుని..2024 చివరిలో దక్కించుకున్న విజయం అద్వితీయం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా గుర్తు చేసి మరీ ప్రశంసించడం గమనార్హ్హం. ఇక ఆటని వదిలేద్దామనుకున్న తరుణంలో ఫిడే విమెన్స్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా హంపి ఆవిర్భవించిన తీరు అద్భుతం. ఈ సందర్భంగా ఆమెపైనా ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తాయి. 37 ఏళ్ల వయసులో హంపి..తన ప్రత్యర్ధి ఇండోనేషియాకి చెందిన సుకందర్‌పై విజయం సాధించింది.
అటు గుకేశ్ ఇటు హంపి సాధించిన విజయాలు మన దేశంలో యువత చదరంగంవైపు తమ దృష్టి సారించడానికి దోహదపడతాయ్. స్పోర్ట్స్ అంటే క్రికెట్, హాకీ..మాత్రమే కాదు అసలు సిసలు మైండ్ గేమ్-చెస్ అని ట్రైనింగ్ సెంటర్లవైపు చూడటానికి దారులు పరిచాయంటే సందేహమే లేదు.