IND vs AUS 4th test : నాలుగో టెస్టులో భారత్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం..
టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.

Border Gavaskar Trophy Australia won by 184 runs in 4th test against india
టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ 184 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. 340 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (84; 208 బంతుల్లో 8 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. రిషబ్ పంత్ (30; 104 బంతుల్లో 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు.
వీరిద్దరు మినహా మిగిలిన అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5), రవీంద్ర జడేజా (2), నితీశ్ రెడ్డి (1), ఆకాశ్ దీప్ (1) లు విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. నాథన్ లైయాన్ రెండు వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్‌లు చెరో వికెట్ సాధించారు.
ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు కీలకమైన 105 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 340 పరుగుల లక్ష్యం నిలవగా టీమ్ఇండియా 155 పరుగులకే కుప్పకూలింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం..
ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే కేవలం ఒకే ఒక దారి ఉంది. సిడ్నీ వేదికగా జనవరి 3 తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ తప్పకగెలవాలి. అప్పడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 2-2తో సమం అవుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-0తో గెలవాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉన్న ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుంటే అది జరగడం కాస్త కష్టమే. దీంతో టీమ్ఇండియా ఫైనల్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్లే.
JUBILATION FOR PAT CUMMINS AND HIS BOYS. 🇦🇺
– Down 0-1 to now leading 2-1. pic.twitter.com/Ejovfw08ZM
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024