Chetan Sakariya: చేతన్ సకారియా ఇంట మరో విషాదం

Chetan Sakariya: చేతన్ సకారియా ఇంట మరో విషాదం

Chetan Sakariya

Updated On : May 10, 2021 / 8:42 AM IST

Chetan Sakariya: చేతన్ సకారియా ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సకారియా అతడి ఆట తీరుతో అందరిని తనవైపు తిప్పుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన చేతన్ క్రికెట్ వైపు అడుగులు వేశారు. తన ఆటతీరుతో ఐపీఎల్ సెలెటర్ల కంట్లో పడ్డాడు. ఇతడి ట్రాక్ రికార్డ్ చూసిన రాజస్థాన్ సెలెక్టర్లు తమ జట్టులోకి తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే.. కరోనా సోకడంతో చేతన్ తండ్రి కంజీ భాయ్ మృతి చెందారు. గత వారం కంజీకి కరోనా సోకింది.

దీంతో అతడిని గుజరాత్ లోని భావ్ నగర్ లో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫాంచైజీ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. చేతన్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదట్లో చేతన్ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎల్ కు ఎంపిక అవ్వకముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో చేతన్ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

కానీ ఈ విషయాన్నీ చేతన్ కు తెలియచెయ్యలేదు. కుటుంబ సభ్యులు ట్రోఫీ ముగిసిన తర్వాత తమ్ముడి ఆత్మహత్య విషయం చేతన్ కు తెలిపారు. ఇక తన తండ్రి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఐపీఎల్ వచ్చిన డబ్బుతోనే చికిత్స చేయించాడు చేతన్.