IPL 2023: ముంబై జట్టు నుంచి జోఫ్రా ఆర్చర్ ఔట్.. టీంలోకి కొత్త ప్లేయర్ ..

ముంబై ఇండియన్స్ జట్టు పాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

IPL 2023: ముంబై జట్టు నుంచి జోఫ్రా ఆర్చర్ ఔట్.. టీంలోకి కొత్త ప్లేయర్ ..

Chris Jordan

Updated On : May 9, 2023 / 1:23 PM IST

IPL 2023: ఐపీల్ 2023 సీజన్‌లో ప్రతీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరి ఓవర్ వరకు విజయం సాధించే జట్టు ఏదో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వానేనా అన్నట్లుగా జట్ల మధ్య పోరుసాగుతుంది. ఈ క్రమంలో ఆయా జట్లకు చెందిన కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరం అవుతున్నారు. ఇటీవల లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు గాయం కావడంతో అతను ఐపీఎల్ 2023 సీజన్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇదే బాటలో మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ జట్టు కీలక ఆటగాడు, స్టార్ పేసర్ చేరిపోయాడు.

KKR Captain Nitish Rana: కేకేఆర్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు షాకిచ్చిన బీసీసీఐ..

ముంబై ఇండియన్స్ జట్టు పాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్ ప్రథమార్థంలో ఆర్చర్ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించారని, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ముంబై ఇండియన్స్ పేర్కొంది. అయితే, ఆర్చర్ స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్, ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్దాన్ ముంబై జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి క్రిస్ జోర్దాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముంబై ఇండియన్స్ తెలిపింది.

IPL 2023, KKR vs PBKS: పంజాబ్ పై కోల్‌క‌తా గెలుపు.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడిన జోర్ధాన్ తన ఐదో ఐపీఎల్ ప్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాకుండా జోర్దార్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో కలిసి ఆడాడు. ఈ ఇంగ్లీష్ ఆటగాడు ఇప్పటి వరకు ఐపీఎల్ లో 28 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు.

IPL 2023: ఆఖ‌రి బంతికి స‌మ‌ద్ స్ట్రైక్‌కు ఎలా వ‌చ్చాడు..? అలా రావొచ్చా..?

ఇదిలాఉంటే ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు 10 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ లలో విజయం సాధించగా, ఐదు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మంగళవారం రాత్రి ముంబై జట్టు కీలక మ్యాచ్ ఆడనుంది. రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.