Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు క్రికెట్ ఆస్ట్రేలియా షాక్‌.. టీ20 ప్రపంచకప్ ‘టోర్న‌మెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే..

బెస్ట్ ప్లేయ‌ర్‌తో కూడిన టోర్న‌మెంట్ ఆఫ్ ది టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్ర‌క‌టించింది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు క్రికెట్ ఆస్ట్రేలియా షాక్‌.. టీ20 ప్రపంచకప్ ‘టోర్న‌మెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే..

Cricket Australia T20 World Cup 2024 XI Rohit Sharma not picked as captain

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. బార్బ‌డోస్ వేదిక‌గా మ‌రికొన్ని గంట‌ల్లో ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ టోర్నీలోని మ్యాచులు అభిమానుల‌కు కావాల్సిన వినోదాన్ని అందించాయి. అఫ్గానిస్తాన్ జ‌ట్టు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల‌కు షాకివ్వ‌గా.. పాకిస్తాన్ జ‌ట్టుకు అమెరికా ఝ‌ల‌క్ ఇచ్చింది.

ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు బెస్ట్ ప్లేయ‌ర్‌తో కూడిన టోర్న‌మెంట్ ఆఫ్ ది టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్ర‌క‌టించింది. ఈ మెగాటోర్నీలో అత్యుత్తంగా రాణించిన ఆట‌గాళ్ల‌కు ఈ జ‌ట్టులో చోటు ఇచ్చింది. అయితే.. ఆశ్చ‌ర్య‌క‌రంగా రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ ఇవ్వ‌లేదు. అఫ్గానిస్తాన్ ప్లేయ‌ర్‌కు ర‌షీద్ ఖాన్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను ఇచ్చింది.

T20 World Cup 2024 Prize Money : ఫైన‌ల్‌లో టీమ్ఇండియా గెలిచినా ఓడినా డ‌బ్బే డ‌బ్బు.. విజేతగా నిలిస్తే ఎంతంటే..?

ముగ్గురు భార‌త ఆట‌గాళ్ల‌కు జ‌ట్టులో ఛాన్స్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ నుంచి ఇద్ద‌రు చొప్పున వెస్టిండీస్‌, అమెరికా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జ‌ట్ల నుంచి ఒక్కొక్క‌రిని ఎంపిక చేసింది.

ఓపెనర్ల విషయానికి వస్తే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్‌ల‌ను ఎంపిక చేసింది. వ‌న్‌డౌన్‌లో వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్‌కు అవ‌కాశం ఇచ్చింది. నాలుగో స్థానంలో ఆరోన్ జోన్స్, ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో మార్క‌స్ స్టోయినిస్‌, హార్దిక్ పాండ్య‌ల‌ను ఎంపిక చేసింది. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా , అన్రిచ్ నార్ట్జే, ఫజల్హాక్ ఫరూఖీలు ఎంపిక అయ్యారు.

INDW vs SAW : 90 ఏళ్ల మ‌హిళ‌ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో టీమ్ఇండియా స‌రికొత్త రికార్డు..

క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ జ‌ట్టు : రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, నికోలస్ పూరన్, ఆరోన్ జోన్స్, మార్కస్ స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ (కెప్టెన్‌), రిషద్ హొస్సేన్, అన్రిచ్ నోర్ట్జే, జస్ప్రీత్ బుమ్రా, ఫజల్హాక్ ఫరూకీ.