Cricketer Mohammed Shami : షమి స్వగ్రామం సాహస్‌పూర్ అలీనగర్‌కు మహర్దశ…యూపీ సర్కారు కొత్త ప్రతిపాదనలు

పురుషుల ఓడీఐ ప్రపంచ కప్ 2023లో ఇండియా జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్మోహా జిల్లా సహస్‌పూర్ అలీనగర్ వార్తల్లోకి ఎక్కింది....

Cricketer Mohammed Shami : షమి స్వగ్రామం సాహస్‌పూర్ అలీనగర్‌కు మహర్దశ…యూపీ సర్కారు కొత్త ప్రతిపాదనలు

Cricketer Mohammed Shami

Cricketer Mohammed Shami : పురుషుల ఓడీఐ ప్రపంచ కప్ 2023లో ఇండియా జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్మోహా జిల్లా సహస్‌పూర్ అలీనగర్ వార్తల్లోకి ఎక్కింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్లు తీసిన మహ్మద్ షమీ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మినీస్టేడియం, వ్యాయామశాల

బౌలింగ్ లో షమీ రికార్డు సృష్టించిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షమీ స్వగ్రామమైన సహస్‌పూర్ అలీనగర్ లో ప్రజల కోసం మినీస్టేడియం, వ్యాయామశాల నిర్మించాలని నిర్ణయించింది. సర్కారు ఆదేశంతో అమ్రోహ జిల్లా అధికారులు సహస్‌పూర్ అలీనగర్ గ్రామానికి వచ్చి స్టేడియం, వ్యాయామశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ సరిహద్దు అసెంబ్లీ సెగ్మెంట్లలో పొరుగు రాష్ట్రాల ప్రభావం…పొరుగు నేతల ప్రచారం

షమీ స్వగ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని, అక్కడ మినీస్టేడియం, ఓపెన్ జిమ్ నిర్మిస్తామని అమ్రోహా జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ త్యాగి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియాలను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, షమీ స్వగ్రామాన్ని కూడా ఎంపిక చేశామని రాజేష్ చెప్పారు.

ALSO READ : Telangana Assembly Elections 2023 : వలస ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి…ఇతర రాష్ట్రాల నుంచి పోలింగుకు తీసుకువచ్చేందుకు అభ్యర్థుల యత్నాలు

మినీ స్టేడియం, వ్యాయామశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు శుక్రవారం డీఎం త్యాగి నేతృత్వంలోని బృందం షమి గ్రామాన్ని సందర్శించింది.మహమ్మద్ షమీ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఉన్న సహస్‌పూర్ అలీనగర్ గ్రామానికి చెందినవాడు. ప్రపంచకప్ ఆరు మ్యాచ్ లలో 23 వికెట్లు తీసిన షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచారు.

ALSO READ : Railways Good News : దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త

భారత జట్టులోకి హార్ధిక్ పాండ్యా, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లతో కూడిన ఫాస్ట్ బౌలింగ్ కలయికను ఎంచుకున్నారు. గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా అనర్హుడిగా ప్రకటించడంతో షమీ జట్టులోకి వచ్చాడు. అలా వచ్చిన షమీ న్యూజిలాండ్ జట్టుపై పోటీలో ఏకంగా ఏడు వికెట్లు తీసి సంచలనం సృష్టించారు.