IPL 2020లో ధోనీ బ్యాటింగ్ పొజిషన్ చెప్పేసిన కోచ్

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సే ఈ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో సత్తా చూపేందుకు సీఎస్కే సిద్ధమైందని అంటున్నాడు. ఈ సారి టోర్నీలో ధోనీ నెం.4లో బ్యాటింగ్ కు వస్తే కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. జులై తర్వాత ధోనీ క్రికెట్ గ్రౌండ్ కనిపించనుంది మళ్లీ ఐపీఎల్ లోనే. అభిమానుల ఎగ్జైట్మెంట్ కు అతని యాక్షన్ తోడైతే దానిని స్టేడియంలోనే చూడాలి.
యూఏఈలో జరగనున్న ఐపీఎల్ లో ఆడేందుకు జట్లన్నీ ఆగష్టు 20న బయల్దేరనున్నాయి. జట్టు ప్రిపరేషన్ మీదనే ధ్యాసంతా పెట్టానని కోచ్ అంటున్నారు. మిడిలార్డర్ పై ఫోకస్ పెడుతున్నామని.. ధోనీ ఆ పొజిషన్లో వస్తే ఇంకా బాగుంటుందని అన్నాడు.
‘ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చేయాలంటే.. నెం.4కచ్చితంగా సరిపోతుంది. కానీ, పరిస్థితికి తగ్గట్లు ఆడటానికి అందరూ రెడీ అవ్వాలి. టీంకు ఎప్పుడు ఏది కావాలో ఇప్పుడే చెప్పలేం కదా. ప్రస్తుతం ప్రిపరేషన్ దశలోనే ఉన్నాం’ అని హస్సే మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ధోనీ సాధారణంగా నెం.6లో లేదా 5లో వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. హస్సే టీం పర్‌ఫార్మెన్స్ గురించి ఇంప్రెస్ అయినట్లు చెప్పాడు. కొన్ని సంవత్సరాలుగా జట్టుతో ఉంటున్న వారిని చెన్నై అలాగే అట్టిపెట్టుకుంది. కెప్టెన్ ధోనీ, సురేశ్ రైనా, డేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజాలు జట్టుకు దన్నుగా నిలిచారు. వీరితో పాటు షేన్ వాట్సన్, హర్భజన్ సింగ్ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చారు.
ఇంకొక విషయం ఏమిటంటే సీఎస్కేకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మంచి స్పిన్ బలం ఉంటుంది. హర్భజన్ జడేజా, తాహిర్, పీయూశ్ చావ్లా, కర్ణ్ శర్మ, మిచెల్ శాంతర్ లకు బాగా కలిసొచ్చే అంశమిది. యూఏఈ నేల మీద మంచి గ్రిప్ ఉన్న వారు.
అక్కడికి వెళ్తాం. మంచి హార్డ్ వర్క్ చేస్తాం. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్లు ఉండటం మా అదృష్టం. గేమ్ గురించి కరెక్ట్ గా అవగాహన చేసుకోగలరు. టాస్క్ ఏంటో.. ఎలా రెడీ కావాలో.. వాళ్లకు సరిగ్గా తెలుసు అని హస్సే వెల్లడించారు.