MS Dhoni : మహేంద్రసింగ్ ధోనీ చెపాక్ స్టేడియంలో ఏం చేశాడో చూశారా? వీడియో వైరల్
చెపాక్ స్టేడియంలో జట్టు ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ పాల్గొన్నాడు. అంతకుముందు.. స్టేడియంకు వచ్చే సమయంలో ....

MS Dhoni
IPL 2024 : ఈనెల 22న నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. అన్ని జట్ల ఆటగాళ్లు టోర్నీకోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టు శిభిరంలో చేరాడు. తొలిసారి చెపాక్ స్టేడియంలో జట్టు ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ పాల్గొన్నాడు. అంతకుముందు.. వారు బస చేసిన హోటల్ నుంచి స్టేడియంకు ప్రత్యేక బస్సులో ధోనీతో సహా సీఎస్ కే జట్టులోని పలువురు ప్లేయర్లు చెపాక్ స్టేడియంకు చేరుకున్నారు. బస్సు వెనుక భాగంలో కూర్చున్న ధోనీని చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. ధోనీసైతం వారివైపు చేతులు ఊపుతూ వారిని ఉత్సాహపర్చారు. ఆ తరువాత చెపాక్ స్టేడియంలోకి ధోనీ ఎంట్రీ ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది.
ఎంఎస్ ధోనీ పాత లుక్ లో కనిపించాడు. పొడవాటి జట్టుతో పాతధోనీని గుర్తుకు తెచ్చాడు. రెండు చేతులతో రెండు బ్యాట్లు పట్టుకొని స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ధోనీ, సీఎస్ కే జట్టు అభిమానులు తలా వచ్చేశాడు.. ఈసారికూడా ఐపీఎల్ కప్ సీఎస్ కే దే అంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. టోర్నీలో భాగంగా ఈనెల 22న జరిగే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.
Also Read : ధర్మశాల టెస్టులో యశస్వి జైస్వాల్ రికార్డులు ఇవే.. వెయ్యి పరుగులు, అత్యధిక సిక్సర్లు..
గత ఏడాది జరిగిన ఐపీఎల్-2023 టైటిల్ ను ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో ధోనీ సారథ్యంలో సీఎస్ కే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. ఐపీఎల్ -2024లోనూ ధోనీ సారథ్యంలోనే సీఎస్ కే జట్టు బరిలోకి దిగబోతోంది. దీంతో మరోసారి టైటిల్ ను గెలుచుకోవాలని ఆ జట్టు ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు గతేడాది ఐపీఎల్ టోర్నీలో సమయంలో మోకాలి గాయంతో ధోనీ ఇబ్బంది పడ్డాడు. టోర్నీ తరువాత శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
Also Read : Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 50 సిక్సర్లు
MS Dhoni is back at the Chepauk…!!!pic.twitter.com/TbWh1YZvKI
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024
The sMileS are back! ??#WhistlePodu #Yellove ? pic.twitter.com/D63tS5jocL
— Chennai Super Kings (@ChennaiIPL) March 7, 2024