Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్స‌ర్లు

టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు.

Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్స‌ర్లు

Rohit Sharma

Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ)లో 50 సిక్స‌ర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇంగ్లాండ్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్ట‌డంతో డ‌బ్ల్యూటీసీలో 50 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ త‌రువాతి స్థానంలో రిష‌బ్ పంత్ ఉన్నాడు. అత‌డు 38 సిక్స‌ర్లు బాదాడు.

ఇక ఓవ‌రాల్‌గా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు అత‌డు 78 సిక్సర్లు కొట్టాడు.

WTCలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయ‌ర్లు..

బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్‌) – 78 సిక్సర్లు
రోహిత్ శర్మ (భార‌త్‌) – 50 సిక్సర్లు
రిషబ్ పంత్ (భార‌త్‌) – 38 సిక్సర్లు
జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్‌) – 29 సిక్సర్లు
యశస్వి జైస్వాల్ (భార‌త్‌) – 29 సిక్సర్లు
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 25 సిక్సర్లు

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త‌.. కోహ్లి రికార్డు బ్రేక్..

మ‌రో ఐదు బాదితే..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్ శ‌ర్మకు ఇంకా 5 సిక్స‌ర్లు అవ‌స‌రం. రోహిత్ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 595 సిక్సర్లు బాదాడు. మరో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు బాదిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 595
క్రిస్‌ గేల్ (వెస్టిండీస్‌) – 553
షాహిద్‌ అఫ్రిది (పాకిస్తాన్‌) – 476,
మార్టిన్‌ గప్తిల్ (న్యూజిలాండ్‌) – 398
మ‌హేంద్ర సింగ్ ధోని (భార‌త్‌) – 383
స‌న‌త్ జయసూర్య (శ్రీలంక‌) – 359
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 352
ఏబీ డివిలియర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 346
జోస్‌ బట్లర్ (ఇంగ్లాండ్‌) – 328

Ashwin : హాస్పిట‌ల్‌ బెడ్ పై ఉన్న అమ్మ నాకు చెప్పింది అదే : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌