Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త‌.. కోహ్లి రికార్డు బ్రేక్..

సూప‌ర్ ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌నత సాధించాడు.

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త‌.. కోహ్లి రికార్డు బ్రేక్..

Jaiswal surpasses Virat Kohli in most runs in a Test series by an Indian list

Yashasvi Jaiswal – Virat Kohli : సూప‌ర్ ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌నత సాధించాడు. ఇంగ్లాండ్‌ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఆఖ‌రి, ఐదో టెస్టు మ్యాచ్‌లో అత‌డు దీన్ని అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ పై ఓ టెస్టు సిరీస్‌లో కోహ్లి 655 ప‌రుగులు చేయ‌గా.. ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచుల్లో జైస్వాల్ అన్నే ప‌రుగులు చేసి స‌మంగా ఉన్నాడు. తాజా మ్యాచ్‌లో అండ‌ర‌న్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసి కోహ్లిని అధిగ‌మించాడు.

ఇంగ్లాండ్ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు..

య‌శ‌స్వి జైస్వాల్ – 9 ఇన్నింగ్స్‌లు – 656* ప‌రుగులు (2024లో)
విరాట్ కోహ్లి – 8 ఇన్నింగ్స్‌లు – 655 ప‌రుగులు (2016-17లో)
రాహుల్ ద్ర‌విడ్ – 6 ఇన్నింగ్స్‌లు – 602 ప‌రుగులు (2002లో)
విరాట్ కోహ్లి – 10 ఇన్నింగ్స్‌లు- 593 (2018లో)

Kuldeep Yadav : కుల్దీప్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు..

కాగా.. ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా సునీల్ గ‌వాస్క‌ర్ ఉన్నాడు. గ‌వాస్క‌ర్ రెండు సార్లు 700 పైగా ప‌రుగులు సాధించాడు. ఆ త‌రువాత విరాట్ కోహ్లి 692 ప‌రుగ‌లతో ఉన్నాడు. చూడాలి మ‌రీ ఈ మ్యాచ్‌లో గ‌వాస్క‌ర్ రికార్డును జైస్వాల్ బ‌ద్ద‌లు కొడ‌తాడో లేదో.

ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయులు

సునీల్ గవాస్కర్ – 774 పరుగులు – వెస్టిండీస్‌పై 1970-71 (వెస్టిండీస్‌లో)
సునీల్ గవాస్కర్ – 732 పరుగులు – వెస్టిండీస్‌పై 1978-79 (భారత్‌లో)
విరాట్ కోహ్లీ – 692 – ఆస్ట్రేలియా పై 2014-15 (ఆస్ట్రేలియాలో)
యశస్వి జైస్వాల్ – 656* ప‌రుగులు – ఇంగ్లాండ్ పై 2024లో (భారత్‌లో)
విరాట్ కోహ్లీ – 655 పరుగులు – ఇంగ్లాండ్ పై 2016-17లో (భారత్‌లో )

Shubman Gill : సూపర్ మ్యాన్‌ త‌ర‌హాలో స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్న శుభ్‌మ‌న్ గిల్‌.. వీడియో వైర‌ల్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త స్పిన్న‌ర్లు విజృంభించ‌డంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జాక్‌క్రాలీ (79) అర్ధ‌శ‌త‌కం బాదాడు. జానీ బెయిర్ స్టో (29), బెన్‌డ‌కెట్ (27), జోరూట్ (26), బెన్‌ఫోక్స్ (24)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్లలో కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్లతో చెల‌రేగ‌గా.. ర‌విచంద్ర‌న్ అశ్విన్ నాలుగు, ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.