Kuldeep Yadav : కుల్దీప్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు..

భార‌త స్పిన్ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు.

Kuldeep Yadav : కుల్దీప్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు..

Kuldeep Yadav

Kuldeep Yadav 50 wickets in tets : భార‌త స్పిన్ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఆట‌గాడిగా ఈ చైనామన్‌ స్పిన్నర్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టో ను ఔట్ చేయ‌డం ద్వారా కుల్దీప్ ఈ ఘ‌న‌తను అందుకున్నాడు.

కుల్దీప్ యాద‌వ్ టెస్టుల్లో కేవ‌లం 1871 బంతుల‌ను విసిరి 50 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో అత‌డు అక్ష‌ర్ ప‌టేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్ 2205 బంతుల్లో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

Shubman Gill : సూపర్ మ్యాన్‌ త‌ర‌హాలో స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్న శుభ్‌మ‌న్ గిల్‌.. వీడియో వైర‌ల్‌


టెస్టుల్లో అత్య‌ధిక వేగంగా 50 వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు (బంతుల ప‌రంగా)

కుల్దీప్ యాద‌వ్ – 1871 బంతులు
అక్షర్ పటేల్ – 2205 బంతులు
జస్ప్రీత్ బుమ్రా – 2520 బంతులు
రవిచంద్రన్ అశ్విన్ – 2597 బంతులు

ఇక మ్యాచ్‌లో కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో తొలి రోజు టీ విరామానికి ఇంగ్లాండ్ 55 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. బెన్‌ఫోక్స్ (8), షోయ‌బ్ బ‌షీర్ (5)లు క్రీజులో ఉన్నారు. జాక్ క్రాలీ (79) హాఫ్ సెంచ‌రీ చేశాడు. బెన్ డ‌కెట్ (27), జోరూట్ (26), జానీ బెయిర్ స్టో (29) మంచి ఆరంభాల‌ను భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ 5 వికెట్లు తీయ‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు వికెట్లు, ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ సాధించాడు.

Ashwin : హాస్పిట‌ల్‌ బెడ్ పై ఉన్న అమ్మ నాకు చెప్పింది అదే : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌