David Warner : వార్న‌ర్ మామా.. ప్ర‌పంచ రికార్డు.. ఆసీస్‌ జోరుకు వ‌ర్షం బ్రేకులు

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్య‌ధిక సార్లు వంద ప‌రుగుల ఓపెనింగ్ భాగ‌స్వామ్యాల‌లో పాలు పంచుకున్న ఆట‌గాడిగా ప్ర‌పంచ రికార్డును నెల‌కొల్పాడు.

David Warner : వార్న‌ర్ మామా.. ప్ర‌పంచ రికార్డు.. ఆసీస్‌ జోరుకు వ‌ర్షం బ్రేకులు

David Warner

David Warner record : ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్య‌ధిక సార్లు వంద ప‌రుగుల ఓపెనింగ్ భాగ‌స్వామ్యాల‌లో పాలు పంచుకున్న ఆట‌గాడిగా ప్ర‌పంచ రికార్డును నెల‌కొల్పాడు. యాషెస్ (Ashes) సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వార్న‌ర్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఉస్మాన్ ఖ‌వాజాతో క‌లిసి అత‌డు మొద‌టి వికెట్‌కు వంద‌కు పైగా ప‌రుగులు జోడించాడు.

Rahul Dravid : కోహ్లి, రోహిత్‌ల‌ను ఆడించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌దే.. మా ల‌క్ష్యం ఏంటంటే..? రాహుల్ ద్ర‌విడ్‌

ఇప్ప‌టి వ‌ర‌కు 100 ప‌రుగుల ఓపెనింగ్ భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పిన రికార్డు జాక్ హ‌బ్స్‌, గ్రేమ్ స్మిత్‌, అలిస్ట‌ర్ కుక్‌ల పేరిట ఉండేది. వీరంద‌రూ త‌లా 24 సార్లు వంద ప‌రుగుల ఓపెనింగ్ పార్ట‌న‌ర్ షిప్‌లు నెల‌కొల్పారు. వార్న‌ర్ వీరి రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 25 సార్లు వార్న‌ర్ 100 ప‌రుగుల ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్స్‌లో భాగం అయ్యాడు. ఈ జాబితాలో భార‌త ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌(23), మైఖేల్ అథ‌ర్ట‌న్‌(23) మూడో స్థానంలో ఉన్నారు.

యాషెస్ సిరీస్‌లో నాలుగో ఆట‌గాడిగా..

ఇక యాషెస్ సిరీస్‌లో ఏ వికెట్‌కైనా అత్య‌ధిక సెంచ‌రీ భాగ‌స్వామ్యాలు న‌మోదు చేసిన జాబితాలో డేవిడ్ వార్న‌ర్ నాలుగో స్థానానికి దూసుకువ‌చ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వార్న‌ర్ యాషెస్ సిరీసుల్లో 8 సార్లు వంద ప‌రుగుల భాగ‌స్వామ్యాల్లో పాలుపంచుకున్నాడు. ఈ జాబితాలో జాక్ హ‌బ్స్ (16) అగ్ర‌స్థానంలో ఉండ‌గా ఆ త‌రువాతి స్థానాల్లో హెర్బ‌ర్ట్ స‌ట్బ్‌క్లిఫ్‌(15), మార్క్ టేల‌ర్‌(10)లు ఉన్నారు.

Stuart Broad : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన యువ‌రాజ్ సింగ్ బాధితుడు.. ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 283 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 295 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 395 ప‌రుగులు చేయ‌గా ఆస్ట్రేలియా ముందు 384 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలోకి దిగిన ఆసీస్ ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌(58), ఉస్మాన్ ఖ‌వాజా(69)లు అర్థ‌శ‌త‌కాలు దూకుడుగా ఆడుతుండ‌గా వ‌రుణుడు ఆట‌కు బ్రేక్‌లు వేశాడు. డ్రింక్స్ త‌ర్వాత‌ వ‌ర్షం మొద‌లుకావడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. వ‌ర్షం త‌గ్గ‌పోవ‌డంతో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆసీస్ వికెట్ న‌ష్ట‌పోకుండా 135 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజ‌యానికి ఆఖ‌రి రోజు మ‌రో 249 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఇంగ్లాండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి.

ENG vs AUS Ashes 2023 : యాషెస్ చరిత్రలో బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు .. ఆ విషయంలో రోహిత్‌దే అగ్ర‌స్థానం