అద్భుతం చేశాడు : టీ20ల్లో దీపక్ చాహర్ వరల్డ్ రికార్డ్
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. కాగా, భారత బౌలర్ దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బంగ్లాదేశ్ పై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకి విజయాన్ని అందించాడు.
భారత్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు చాహర్. అంతేకాదు టీ20లో అజంతా మెండిస్ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేశాడు. మొత్తం మీద 3.2 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చిన చాహర్ 6 వికెట్లు పడగొట్టి టీ20ల్లో కొత్త రికార్డ్ సృష్టించాడు. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన దీపక్ చాహర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
దీపక్ చాహర్ తన తొలి ఓవర్ లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ వచ్చి కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఈ 3 వికెట్లు తీసిన తర్వాత.. మరో 3 వికెట్లు అతని ఖాతాలో ‘హ్యాట్రిక్’ను చేర్చాయి. 18వ ఓవర్ చివరి బంతికి షఫీయుల్ ని… ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను ఔట్ చేసి చాహర్ ‘హ్యాట్రిక్’తో పాటు ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.
ఒకానొక సమయంలో బంగ్లా పటిష్ట స్థితిలో ఉంది. బంగ్లా గెలుస్తుందని అంతా అనుకున్నారు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో మొహమ్మద్ నయీమ్ (81), మొహమ్మద్ మిథున్ (27) లు జోరు పెంచారు. భారత బౌలర్లకు చిక్కకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో నయీమ్ 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకే స్కోర్ దగ్గర మిథున్, రహీమ్ (0) ఔట్ అవ్వడంతో బంగ్లాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపై నయీమ్ కూడా పెవిలియన్ చేరడంతో బంగ్లా వికెట్ల పతనం ఆగలేదు.
* భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ‘హ్యాట్రిక్’ తీసిన తొలి బౌలర్ దీపక్ చాహర్. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్. మలింగ (శ్రీలంక) రెండుసార్లు ‘హ్యాట్రిక్’ తీయగా… బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్ (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), హస్నయిన్ (పాకిస్తాన్), ఖవర్ అలీ (ఒమన్), వనువా (పపువా న్యూ గినియా) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు.
* అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్ దీపక్ చాహర్. ఈ ఫార్మాట్‌లోనే అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ (6/8; జింబాబ్వేపై 2012లో… 6/16; ఆస్ట్రేలియాపై 2011లో), భారత స్పిన్నర్ చహల్ (6/25; ఇంగ్లండ్‌పై 2017లో) మాత్రమే 6 చొప్పున వికెట్లు తీశారు.
* అశ్విన్ (52 వికెట్లు), బుమ్రా (51 వికెట్లు) తర్వాత టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో భారత బౌలర్ యజువేంద్ర చాహల్. తక్కువ మ్యాచుల్లోనే (34) ఈ ఘనత సాధించాడు.