IPL 2025 : అఫీషియ‌ల్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్‌.. ఇప్ప‌టికైనా ఆ జ‌ట్టు రాత మారేనా..?

ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్‌ను నియ‌మించింది.

IPL 2025 : అఫీషియ‌ల్‌..  ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్‌.. ఇప్ప‌టికైనా ఆ జ‌ట్టు రాత మారేనా..?

Updated On : March 14, 2025 / 9:56 AM IST

ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ జ‌ట్టు కెప్టెన్‌ను ప్ర‌క‌టించింది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో అక్ష‌ర్ ప‌టేల్ ఆ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అక్ష‌ర్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో బ‌రిలోకి దిగనున్న‌ట్లు ఢిల్లీ మేనేజ్‌మెంట్ వెల్ల‌డించింది.

2019 నుంచి ఢిల్లీ జ‌ట్టులో అక్ష‌ర్ ప‌టేల్ కొన‌సాగుతున్నాడు. మెగావేలానికి ముందు అత‌డిని ఢిల్లీ రూ.18 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. కాగా.. అత‌డికి కెప్టెన్సీ అనుభ‌వం పెద్ద‌గా లేన‌ప్ప‌టికి ఢిల్లీ అత‌డిపై న‌మ్మ‌కం ఉంచింది.

IPL 2025 : ఆర్‌సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు, ప్ర‌త్య‌ర్థులు

గ‌త సీజ‌న్‌లో అత‌డు ఓ ఐపీఎల్ మ్యాచ్‌కి ఢిల్లీకి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా రిష‌బ్ పంత్ ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొన‌గా ఆ మ్యాచ్‌లో అక్ష‌ర్ ప‌టేల్  నాయ‌క‌త్వం వ‌హించాడు.

అక్ష‌ర్ ఢిల్లీ త‌రుపున ఆరు సీజ‌న్ల‌లో 82 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఓవ‌రాల్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 21.5 స‌గటు, 130.9 స్ట్రైక్‌రేటుతో 1653 ప‌రుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 7.27 ఎకాన‌మీతో 123 వికెట్లు తీశాడు.

రాత మారుస్తాడా?

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ ట్రోఫీని అందుకోని జ‌ట్ల‌ల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక‌టి. 17 సీజ‌న్ల‌లో ఆ జ‌ట్టు ఒక్క‌సారి మాత్ర‌మే 2020లో ఫైన‌ల్ కు చేరుకుంది. అయితే.. ఆఖ‌రి మ్యాచ్‌లో త‌డ‌బ‌డి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఇక 2008, 2009 సీజ‌న్ల‌లో సెమీఫైన‌ల్‌కు చేరుకుంది. 2021లో ప్లేఆఫ్స్‌తోనే ప్ర‌యాణం ముగిసింది. ఇవే ఢిల్లీ జ‌ట్టు అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న‌లు. ఇవి మిన‌హా మిగిలిన అన్ని సీజ‌న్ల‌లో లీగ్ ద‌శ‌లోనే ఇంటి ముఖం ప‌ట్టింది.

IPL 2025 : హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ముంబై కెప్టెన్ ఎవ‌రు? ప్ర‌ధానంగా ముగ్గురి మ‌ధ్యే పోటీ?

మ‌రి కొత్త కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ అయినా ఆ జ‌ట్టు త‌ల‌రాత మారుస్తాడో లేదో చూడాల్సిందే.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ఢిల్లీ జ‌ట్టు ఇదే..

అక్షర్‌ పటేల్, కేఎల్‌ రాహుల్, కరుణ్‌ నాయర్, అభిషేక్‌ పోరెల్, సమీర్‌ రిజ్వి, అజయ్‌ మండల్, మాన్వంత్‌ కుమార్, అశుతోష్‌ శర్మ, మాధవ్‌ తివారి, ముకేశ్‌ కుమార్, నటరాజన్, మోహిత్‌శర్మ, విప్రాజ్‌ నిగమ్, త్రిపుర విజయ్, కుల్‌దీప్‌ యాదవ్‌, మిచెల్ స్టార్క్‌, ఫాఫ్ డుప్లెసిస్, జేక్‌ ఫ్రేజర్, డొనోవాన్‌ ఫెరీరా, స్టబ్స్, చమీర,