Chahal Video: విడాకులు తీసుకునే వేళ క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ కోర్టుకు ఎలా వచ్చారో చూడండి..
తమను ఎవరూ గుర్తుపట్టకూడదనుకున్నారో ఏమో..

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మకు కోర్టులో విడాకులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో వారిద్దరు కోర్టుకు వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ విడాకుల ఫైల్‌పై కోర్టు తీర్పు కోసం వారు కాసేపు వేచి చూశారు.
కోర్టుకు వస్తున్న సమయంలో కొందరు వారి ఫొటోలను తీశారు. తమను ఎవరూ గుర్తుపట్టకూడదనుకున్నారో ఏమో వారిద్దరు ముఖాలకు పూర్తిగా మాస్కులు వేసుకుని వచ్చారు. ప్లెయిన్ క్లాత్స్ ధరించారు. సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు. అయినప్పటికీ వారిని ఫొటోగ్రాఫర్లు ఈజీగా గుర్తుపట్టేశారు. వారి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ధనశ్రీ వర్మకు భరణంగా చాహల్ 4.75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని తెలుస్తోంది. అందులో ఇప్పటికే 2.37 కోట్ల రూపాయలు ఇచ్చేశాడని సమాచారం. 6 నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలన్న చాహల్ విజ్ఞప్తిని మొదట ఫ్యామిలీ కోర్టు తిరస్కరించినప్పటికీ, దీనిపై చాహల్ బాంబే హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
Also Read: బంగారం కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే..
ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ఒక జంట చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడానికి ముందు వేచి ఉండాల్సిన వ్యవధిని కూలింగ్ పీరియడ్ అంటారు.
చాహల్, ధనశ్రీ వర్మ వివాహం 2020లో జరిగింది. సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్లు సమాచారం. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణకు గతంలోనూ చాహల్, ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారని తెలుస్తోంది.
వారికి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ విడిపోవడానికే నిర్ణయించున్నట్లు ప్రచారం జరిగింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున యుజ్వేంద్ర చాహల్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును నిన్న హైకోర్టు ఆదేశించగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు వచ్చాయి.
View this post on Instagram
View this post on Instagram