Asia Cup 2023: ఆసియా కప్ మాత్రమే కాదు.. వన్డే ప్రపంచ కప్ మ్యాచులూ ఫ్రీగా చూడొచ్చు..
ఇప్పటికే జియోసినిమా పలు టోర్నమెంట్లను ఉచితంగా స్ట్రీమింగ్ చేసి మొబైల్ యాప్ డౌన్లోడ్ల సంఖ్యను విపరీతంగా పెంచుకున్న విషయం తెలిసిందే.
![Asia Cup 2023: ఆసియా కప్ మాత్రమే కాదు.. వన్డే ప్రపంచ కప్ మ్యాచులూ ఫ్రీగా చూడొచ్చు.. Asia Cup 2023: ఆసియా కప్ మాత్రమే కాదు.. వన్డే ప్రపంచ కప్ మ్యాచులూ ఫ్రీగా చూడొచ్చు..](https://10tv.in/wp-content/uploads/2023/08/New-Project-2023-08-31T150537.970.jpg)
Asia Cup 2023
Asia Cup 2023 – Disney Hotstar: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్-2023తో పాటు అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్-2023 (World Cup 2023) మ్యాచులను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే జియోసినిమా పలు టోర్నమెంట్లను ఉచితంగా స్ట్రీమింగ్ చేసి మొబైల్ యాప్ డౌన్లోడ్ల సంఖ్యను విపరీతంగా పెంచుకున్న విషయం తెలిసిందే. ఆసియా కప్-2023 పాకిస్థాన్, శ్రీలంకతో జరుగుతుండగా, వన్డే ప్రపంచ కప్-2023 భారత్ లో జరగనుంది. గత ఏడాది నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ కు భారీగా నష్టాలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.
యూజర్లు భారీగా తగ్గిపోవడంతో దాదాపు రూ.343 కోట్లు నష్టపోయింది. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జులై మధ్య యూజర్లు దాదాపు 25 శాతం మంది తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీ ఒత్తిడి ఎదుర్కొంటోంది. మళ్లీ లాభాలు రాబట్టడానికి ప్రణాళికలు వేసుకుంది.
జియో సినిమాలో పలు టోర్నమెంట్లు ఉచితంగా ప్రసారమై, డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాకపోవడంతో చాలా మంది హాట్‌స్టార్ సబ్స్ర్కిప్షన్లను రద్దు చేసుకున్నారు. దీంతో జియోలా ఉచితంగా క్రికెట్ మ్యాచులను ప్రసారం చేయాలని డిస్నీ+ హాట్‌స్టార్ నిర్ణయం తీసుకుంది.
హెచ్‌బీవో షోలను డిస్నీ+ హాట్‌స్టార్ లో ఆపేయడం కూడా ఈ ఓటీటీ యూజర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం. గేమ్ ఆఫ్ థ్రోన్స్, సక్సెషన్, త్వరలో ప్రసారం కావాల్సిన హ్యారీ పోటర్ సిరీస్ డిస్నీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారం కావట్లేదు. అవి జియో సినిమాలో ప్రసారం అవుతున్నాయి.
Asia Cup 2023: ఆరోజు పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూడలేమా? అసలు విషయం ఏమిటంటే..