Umpires Salary : ఐపీఎల్‌లో ఒక్కొ మ్యాచ్‌కు అంపైర్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టీ20 లీగ్‌లు ఉన్నా సరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజే వేరు

Do you know how much money umpires earn in IPL
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టీ20 లీగ్‌లు ఉన్నా సరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజే వేరు. క్రికెటర్లు అందరూ కూడా తమ జీవితంలో ఒక్కసారి అయినా ఐపీఎల్ ఆడాలని కోరుకుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురియడమే ఇందుకు ఓ కారణం. ఐపీఎల్ విజయవంతం కావడంలో ఆటగాళ్ల పాత్ర ఎంతో ఉన్నప్పటికి అంపైర్ల పాత్రను మరువలేము.
ఐపీఎల్‌లో అంపైర్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఉండే ఒత్తిడి కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. రసవత్తరంగా సాగే మ్యాచ్‌ల్లో అంపైర్ల నిర్ణయాలు కాస్త అటూ ఇటూ అయినా కూడా ఫలితాలు తారుమారు అవుతాయి. ఏ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే.. సదరు అంపైర్ పై ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.
CSK vs SRH : అయ్యయ్యో! చెన్నై ఓడిపోయిందే.. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్..
మరి అంత ఒత్తిడిలో పని చేసే అంపైర్లు ఐపీఎల్ ద్వారా ఎంత సంపాదిస్తారో మీకు తెలుసా?
డొమెస్టిక్ క్రికెట్‌లో అంపైర్ల జీతాలతో పోలిస్తే ఐపీఎల్‌లో అంపైర్ల సాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఓ డొమెస్టిక్ మ్యాచ్‌లో గ్రేడ్ ఏ అంపైర్ అయితే రోజుకు రూ.40వేలు, గ్రేడ్-బి అంపైర్ అయితే రూ.30 వేల చొప్పున సంపాదిస్తాడు. నాలుగు రోజుల మ్యాచ్ అయితే రూ.1.2 లక్షల నుంచి రూ.1.6లక్షలు చొప్పున అందుకుంటూ ఉంటారు.
అదే ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తే వాళ్లకు జీతాలు భారీగానే ఉంటాయి. ఆన్ ఫీల్డ్ అంపైర్ల విషయానికి వస్తే ఒక్కొ మ్యాచ్‌కు రూ.3లక్షలు, ఫోర్త్ అంపైర్‌కు రూ.2లక్షలు చొప్పున అందుకుంటారు. అంటే ఈ లెక్కన చూస్తే నెలన్నర పాటు సాగే ఐపీఎల్‌లో అంపైర్లు సంపాదించే మొత్తం డొమెస్టిక్ క్రికెట్‌లో ఏడాదంతా చేసినా సంపాదించలేరు.