IND vs NZ : కివీస్ పై విజ‌యం.. బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందుకుంది ఎవ‌రో తెలుసా..? అయ్య‌ర్‌, అక్ష‌ర్‌, కోహ్లీ నామినేట్ కాగా..

కివీస్‌తో మ్యాచ్‌లో ఎవ‌రు బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందుకున్నారో అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

IND vs NZ : కివీస్ పై విజ‌యం.. బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందుకుంది ఎవ‌రో తెలుసా..? అయ్య‌ర్‌, అక్ష‌ర్‌, కోహ్లీ నామినేట్ కాగా..

Do you know who Wins the Best Fielder Medal In Indian Dressing Room After Victory Over New Zealand

Updated On : March 3, 2025 / 11:04 AM IST

దుబాయ్ వేదిక‌గా కివీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 44 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో భార‌త్ గ్రూప్‌-ఏలో అగ్ర‌స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. కాగా.. కివీస్‌తో మ్యాచ్‌లో ఎవ‌రు బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందుకున్నారో అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందిస్తూ వ‌స్తోంది. ఆ మ్యాచ్‌లో ఉత్త‌ర ఫీల్డింగ్ చేసిన ఆట‌గాడిని గుర్తించి ఆ మెడ‌ల్ ను అందిస్తూ వ‌స్తోంది. ఇక సంప్ర‌దాయాన్ని ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లోనూ కొన‌సాగిస్తున్నారు.

Champions Trophy : ‘నువ్వు అలా చేయాల్సింది కాదు..’ జ‌డేజా పై కివీస్‌ మాజీ ఆట‌గాడు తీవ్ర ఆగ్ర‌హం..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ అందుకోగా, పాక్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ మెడ‌ల్ అందుకున్నాడు.

తాజాగా కివీస్‌తో మ్యాచ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, విరాట్ కోహ్లీ, అక్ష‌ర్ ప‌టేల్ లు బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ కోసం నామినేట్ అయ్యారు. అయితే.. విరాట్ కోహ్లీ ఈ మెడ‌ల్‌ను అందుకున్నాడు. జ‌ట్టు త్రో డౌన్ స్పెష‌లిస్ట్ కోచ్ నువాన్ సెనెవిర‌త్నే నుంచి కోహ్లీ ఈ మెడ‌ల్‌ను అందుకున్నాడు.

IND vs AUS : సెమీస్‌లో భార‌త్ పై విజ‌యం సాధించేందుకు ఆసీస్ మాస్ట‌ర్ ప్లాన్‌.. రంగంలోకి డేజంర‌స్ ప్లేయ‌ర్‌..

కాగా.. కివీస్‌తో మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 300 వ‌న్డే అన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ మైలుస్టోన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవ‌లం 11 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఇక సెమీస్‌లో భార‌త్ ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ మంగ‌ళ‌వారం దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2023లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది.