ముంబై మ్యాచ్ లో బ్రావో చెత్త రికార్డు

ముంబై మ్యాచ్ లో బ్రావో చెత్త రికార్డు

Updated On : April 4, 2019 / 7:42 AM IST

ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో చెన్నై 37 పరుగులు తేడాతో ఓడిపోయింది. ముందుగా చెన్నై కెప్టెన్ ధోనీ.. టాస్ గెలిచి ముంబైకి బ్యాటింగ్ ఇచ్చాడు. తక్కువ స్కోరుకే అదుపుచేసి చిత్తు చేస్తామని టాస్ అనంతరం మాట్లాడాడు. ఆ అంచనాలన్నింటినీ పటాపంచలయ్యేలా చేశాడు హార్దిక్ పాండ్యా. ముంబై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో దూకుడుగా ఆడి సత్తా చాటాడు. 

వాటిలో కీలకంగా బ్రావో వేసిన చివరి ఓవరే వ్యవహరించింది. ఒకే ఓవర్లో 29 పరుగులు సమర్పించుకుని చెన్నై టార్గెట్ ను ఆకాశానికెత్తేశాడు. అతనితో పాటుగా బౌలింగ్ చేసిన మిగిలియన ప్లేయర్లతో కలిపి చివరి 6 ఓవర్లలో 88 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. టీ20 క్రికెట్ చరిత్రలో ఆఖరి ఓవర్లో ఇన్ని పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. 

బ్రావో తప్పిదానికి ఐపీఎల్ లో ఆఖరి ఓవర్లో ఎక్కువ పరుగులు బాదిన భాగస్వామ్యంగా హార్దిక్ పాండ్యా-కీరన్ పొలార్డ్ లు రికార్డు సృష్టించారు. 
హార్దిక్ పాండ్యా/ కీరన్ పొలార్డ్- బ్రావో (29)
ఎంఎస్ ధోనీ/రవీంద్ర జడేజా- ఉనద్కత్(28)
సునీల్ నరైన్- వరుణ్ చక్రవర్తి(25)
రాబిన్ ఊతప్ప-ఆండ్రూ రస్సెల్(25)