Elite Women’s Pro Basketball League: ప్రారంభమైన ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్
ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ కు హైదరాబాద్‌లోని డ్రీమ్ బాస్కెట్‌బాల్ అకాడమీ వేదికైంది. నేటి(గురువారం జూన్8)నుంచి అకాడమీలో ట్రై ఔట్స్ ప్రక్రియ ప్రారంభమైంది.
Elite Womens Pro Basketball League
Elite Women’s Pro Basketball League: ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ కు హైదరాబాద్‌లోని డ్రీమ్ బాస్కెట్‌బాల్ అకాడమీ వేదికైంది. నేటి(గురువారం జూన్8)నుంచి అకాడమీలో ట్రై ఔట్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జూన్ 11 వరకు కొనసాగనుంది. ఈ ట్రై ఔట్స్ ప్రక్రియకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి 250 పైగా ఎంట్రీలు అందుతాయని బావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల ఉన్న అథ్లెట్లు ఈ ఏడాది చివరి లోగా అత్యధికంగా డ్రాప్ట్ లో ఉండేలా చూసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ మహిళల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి రకం 5×5 ప్రో బాస్కెట్‌బాల్ లీగ్. టాప్-లెవల్ ఇండియన్ ప్లేయర్ల రోస్టర్లతో నిండిన ఆరు జట్లను కలిగి ఉంది. ఈ లీగ్ ముఖ్య ఉద్దేశ్యం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతిభ ఉన్నవారికి పోటీలో పాల్గొనే అదృష్టం కలిగించడం.
Premier Handball League: తెలుగు టాలన్స్ జెర్సీ ఆవిష్కరణ.. కెప్టెన్ ఎవరంటే..?
ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ CEO సన్నీ భండార్కర్ మాట్లాడుతూ.. మొట్టమొదటి ప్రో ఉమెన్స్ బాస్కెట్‌బాల్ లీగ్‌ని ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. మా లక్ష్యం ఎల్లప్పుడూ లీగ్ ప్లేయర్‌ను సెంట్రిక్‌గా మార్చడమేనని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అపారమైన సాంస్కృతిక వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొనడానికి, పోటీపడేందుకు ఒకచోట చేరడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కలయిక ఏళ్ల తరబడి స్థిరంగా ఉండిపోతుంది. ఇది ప్రారంభం మాత్రమే అని సూచిస్తూ మా ట్యాగ్‌లైన్ Rok Sako Toh Rok Loతో చక్కగా సాగనుందన్నారు.

Elite Women’s Pro Basketball League
మార్చిలో నోయిడాలో జరిగిన ట్రై ఔట్స్‌కు మంచి స్పందన వచ్చింది. 250 మంది కంటే ఎక్కువ అథ్లెట్లు హాజరు అయ్యారు. జూన్ 9 నుంచి జూన్ 11 వరకు హైదరాబాద్‌లో, జూన్ 16 నుంచి జూన్ 18 వరకు ముంబైలో, జూన్ 23 నుంచి జూన్ 25 వరకు కోల్‌కతాలో ట్రై ఔట్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెలక్షన్ కమిటీలో అత్యుత్తమ కోచ్‌లు ఉంటారు.
Global Chess League: జూన్ 21 నుంచి టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్
