END vs IND : ఇంగ్లాండ్ తొండాట‌! జ‌డేజా క్లియ‌ర్‌గా నాటౌట్‌?

భార‌త‌ తొలి ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా ఔట్ అయిన తీరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

END vs IND : ఇంగ్లాండ్ తొండాట‌! జ‌డేజా క్లియ‌ర్‌గా నాటౌట్‌?

jadeja catch by Harry Brook had clearly touched the ground

Updated On : July 25, 2025 / 3:27 PM IST

మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆధిప‌త్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ రెండు వికెట్ల న‌ష్టానికి 225 ప‌రుగులు చేసింది. అంత‌క‌ముందు భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

కాగా.. ఈ మ్యాచ్‌లో భార‌త‌ తొలి ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా ఔట్ అయిన తీరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. జ‌డేజా క్యాచ్ ను ఇంగ్లాండ్ ఫీల్డ‌ర్ హ్యారీ బ్రూక్ స‌రిగ్గా అందుకోలేద‌న్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది. భార‌త ఇన్నింగ్స్ 85వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Tilak Varma : ఓ ప‌క్క భార‌త బ్యాట‌ర్లు ఇబ్బంది ప‌డుతుంటే.. మ‌రోవైపు తిల‌క్ వ‌ర్మ వ‌రుస సెంచ‌రీలు..

ఈ ఓవ‌ర్‌ను జోఫ్రా ఆర్చ‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతిని జ‌డేజా డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్ దిశ‌గా వెళ్లింది. అక్క‌డ ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వ‌డంతో జ‌డేజా కూడా తాను క్యాచ్ ఔట్ అయిన‌ట్లు భావించి పెవిలియ‌న్‌కు వెళ్లాడు.

Karun Nair-KLRahul : క‌న్నీళ్లు పెట్టుకున్న క‌రుణ్ నాయ‌ర్‌.. ఓదార్చిన కేఎల్ రాహుల్‌.. ఇక రిటైర్‌మెంటే త‌రువాయి..!

సాధార‌ణంగా ఆట‌గాళ్లు డైవ్ చేసి క్యాచ్‌లు అందుకున్న స‌మ‌యంలో ఫీల్డ్ అంపైర్లు.. స‌ద‌రు ఫీల్డ‌ర్ స‌రిగ్గానే క్యాచ్ అందుకున్నాడా? లేడా? అనేది చెక్ చేసి ఔట్ ఇస్తారు? కానీ.. ఈ క్యాచ్ విష‌యంలో చెక్ చేయ‌కుండానే ఔట్ ఇచ్చారు. దీనిపై భారత అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హ్యారీ బ్రూక్ క్యాచ్ ప‌ట్టుకున్న స‌మ‌యంలో బంతి నేల‌కు తాకుతున్న‌ట్లుగా కనిపించింద‌ని మండిప‌డుతున్నారు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్ల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.