Shubman Gill : స్టోక్స్ అప్పీల్ చేయడం.. అంపైర్ ఔట్ ఇవ్వడం.. చక చకా జరిగిపోయాయ్.. గిల్ సమీక్ష కోరగా..
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆటతీరు ఏం మాత్రం మారలేదు.

ENG vs IND 4th test Shubman Gill out video viral
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆటతీరు ఏం మాత్రం మారలేదు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో విఫలమైన గిల్.. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58) ఔట్ కావడంతో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన గిల్ ఏ మాత్రం సాధికారంగా కనిపించలేదు.
23 బంతులు ఆడిన గిల్ ఓ ఫోర్ సాయంతో 12 పరుగులు చేసి బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. కాగా.. అతడు ఔటైన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
KL Rahul : వార్నీ కేఎల్ రాహుల్.. సైలెంట్‌గా ఎలైట్ జాబితాలో చేరిపోయావ్‌గా..
CAPTAIN GETS CAPTAIN. 😲
– Ben Stokes removes Shubman Gill. pic.twitter.com/Zm5HnRobvV
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2025
భారత ఇన్నింగ్స్ 50వ ఓవర్‌ను ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ వేశాడు. తొలి బంతిని ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. అయితే.. బంతిని అంచనా వేయడంలో గిల్ విఫలం అయ్యాడు. షాట్ ఆడకుండా వదిలేయగా.. ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్‌పై పడిన బంతి లోపలకి దూసుకొచ్చి ప్యాడ్‌ను తాకింది. వెంటనే స్టోక్స్ అప్పీల్ చేయడం అంపైర్ ఔట్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి. ఇక శుభ్‌మన్ సమీక్ష కోరినా ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది.
కాగా.. గిల్ ఔటైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు టెస్టులు ఆడితే చాలా.. మిగిలిన మ్యాచ్‌లు ఆడవా అంటూ మండిపడుతున్నారు.
ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19)లు క్రీజులో ఉన్నారు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (61)లు హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ (46)లు రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌స్టోక్స్ రెండు వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ పడగొట్టారు.