ENG vs IND : గాయ‌ప‌డిన క్రిస్‌వోక్స్‌.. క‌రుణ్ నాయ‌ర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ ల‌ ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’

భార‌త ఆట‌గాళ్లు కరుణ్ నాయ‌ర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటో మ‌రోసారి చూపించారు.

ENG vs IND : గాయ‌ప‌డిన క్రిస్‌వోక్స్‌.. క‌రుణ్ నాయ‌ర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ ల‌ ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’

ENG vs IND 5th test Karun Nair and Washington Sundar Refuse Run Stunning Spirit Of Cricket

Updated On : August 1, 2025 / 9:30 AM IST

లండన్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు కరుణ్ నాయ‌ర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటో మ‌రోసారి చూపించారు. వారిద్ద‌రు చేసిన ప‌నికి సోష‌ల్ మీడియాలో వారిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

తొలి రోజు ఆట‌లో భార‌త ఇన్నింగ్స్ 57వ ఓవ‌ర్‌ను జేమీ ఓవ‌ర్ట‌న్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతిని టీమ్ఇండియా బ్యాట‌ర్ క‌రుణ్ నాయ‌ర్ మిడాన్ దిశ‌గా షాట్ ఆడాడు. బంతి బౌండ‌రీకి వెలుతుండ‌గా.. దూరం నుంచి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చిన క్రిస్ వోక్స్ డైవ్ చేస్తూ బంతి బౌండ‌రీకి వెళ్ల‌కుండా ఆపాడు. ఈ క్ర‌మంలో అత‌డి భుజం నేల‌ను బ‌లంగా గుద్దుకుంది. దీంతో తీవ్ర‌మైన నొప్పితో వోక్స్ విల‌విల‌లాడిపోయాడు.

ENG vs IND : ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్‌.. భార‌త బ్యాట‌ర్ల‌కు ఇక‌ పండ‌గేనా?

క‌నీసం బంతిని అందుకుని బౌలర్‌కు విసిరే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేక‌పోయాడు. ఈలోగా భార‌త బ్యాట‌ర్లు క‌రుణ్‌, నాయ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు మూడు ప‌రుగులు తీశారు. ఈజీగా నాలుగో ప‌రుగు కూడా తీసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికి వోక్స్ నొప్పితో విల‌విల‌లాడుతుండ‌డాన్ని గ‌మ‌నించి నాలుగో ప‌రుగు తీయ‌కూడద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆట‌గాడి గాయం నుంచి అన్యాయంగా ప్ర‌యోజ‌నం పొంద‌కుండా భార‌త జంట జాగ్ర‌త్త వ‌హించింది.

ఈ ఘ‌ట‌న‌తో క‌రుణ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్నారు. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

ఇక క్రిస్‌వోక్స్ గాయం విష‌యానికి వ‌స్తే.. వెంట‌నే ఫిజియో వ‌చ్చి అత‌డికి ప్రాథమిక చికిత్స అందించాడు. అయితే.. అత‌డి భుజం డిస్‌లొకేట్ అయిన‌ట్లు క‌నిపిస్తుండ‌డంతో అత‌డిని మైదానం నుంచి బ‌య‌ట‌కు తీసుకువెళ్లాడు. అనంత‌రం స్కానింగ్ కోసం అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వోక్స్ అయిన గాయం తీవ్ర‌మైన‌ది అయితే ఈ మ్యాచ్‌లో అత‌డు మ‌ళ్లీ బౌలింగ్ చేయ‌క‌పోవ‌చ్చు.