కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై ..

భారత్ జట్టుపై మోయిన్ కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మెయిన్ అలీ తన బౌలింగ్ లో 10సార్లు ఔట్ చేశాడు.

కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై ..

Moeen Ali

Moeen Ali Retirement : ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ మెయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37ఏళ్ల మొయిన్ అలీ మూడు ఫార్మాట్లలో కలిపి 6,600కుపైగా పరుగులు చేశాడు. 360కిపైగా వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంపై మొయిన్ అలీ మాట్లాడుతూ.. నాకిప్పుడు 37ఏళ్లు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కు ఎంపిక కాలేదు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే ఇంగ్లండ్ తరపున చాలా క్రికెట్ ఆడేశాను. ఇక కొత్తతరం జట్టులోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ నాకేం బాధలేదు. ఇప్పటికీ క్రికెట్ ఆడగలను. కానీ, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నా. తన రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరియైన సమయం అని భావించానని అలీ పేర్కొన్నాడు.

Also Read : Paralympics 2024 : ప్రతిభకుతోడు అదృష్టం కలిసొచ్చింది.. జావెలిన్‌లో సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

భారత్ జట్టుపై మోయిన్ కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మెయిన్ అలీ తన బౌలింగ్ లో 10సార్లు ఔట్ చేశాడు. మొయిన్ అలీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ఐపీఎల్ లో అతను చాలాసార్లు చెన్నై జట్టు విజయంకోసం బలమైన ప్రదర్శన చేశాడు.

Also Read : మరుగుజ్జు అని హేళన చేశారు.. ఇప్పుడు దేశానికి స్వర్ణం తెచ్చాడు

మొయిన్ అలీ 2014లో ఇంగ్లండ్ తరపున అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతను 138 వన్డేలు, 68 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. అలాగే 92 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 2,355 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 111 వికెట్లు కూడా తీశాడు. టెస్టు ఫార్మాట్ లో 3,094 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 204 వికెట్లు తీశాడు. మెయిన్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో 1,229 పరుగులు చేశాడు. 51 వికెట్లు తీశాడు.