Steven Finn : మరో ప్లేయర్ రిటైర్‌మెంట్.. నెలరోజుల వ్యవధిలో నలుగురు ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆటకు వీడ్కోలు
మరో ఇంగ్లాండ్ ప్లేయర్ రిటైర్ అయ్యాడు. పేసర్ స్టీవెన్ ఫిన్ ఆటకు వీడ్కోలు పలికాడు. గత కొంత కాలంగా మెకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ఈ ఆటగాడు క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
Steven Finn retirement : మరో ఇంగ్లాండ్ ప్లేయర్ రిటైర్ అయ్యాడు. పేసర్ స్టీవెన్ ఫిన్ (Steven Finn) ఆటకు వీడ్కోలు పలికాడు. గత కొంత కాలంగా మెకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ఈ ఆటగాడు క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ‘గత ఏడాది కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాను. ఈ పోరాటంలో నేను ఓడిపోయాను. తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నా.’ అని ఫిన్ ఓ ప్రకటనలో తెలిపాడు. మిడిల్‌సెక్స్ తరుపున 2005లో అరంగ్రేటం చేసి ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఆడటాన్ని గర్వంగా బావించినట్లు చెప్పుకొచ్చాడు.
ఇదంతా తన అదృష్టమన్నాడు. ఇక తన ప్రయాణం ఎన్నడూ సాఫీగా సాగలేదని, అయినప్పటికీ తన ప్రయాణాన్ని ఆస్వాదించినట్లు తెలిపాడు. తనకు సహకరించిన క్రికెట్ పెద్దలకు, మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. క్రికెట్ తనకు చాలా ఇచ్చిందని, భవిష్యత్తులో కొత్త సామర్థ్యంలో తిరిగి ఆటకు ఏదైన ఇవ్వాలని బావిస్తున్నట్లు చెప్పాడు.
Team India : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓటమి.. భారత్ ఖాతాలో చేరిన చెత్త రికార్డులు ఇవే..
2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ఫిన్. ఇంగ్లాండ్ తరుపున 36 టెస్టులు, 69 వన్డేలు, 21 టీ10ల్లో ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 125 వికెట్లు, వన్డేల్లో 102 వికెట్లు, టీ20ల్లో 27 వికెట్లు తీశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 5 సార్లు, వన్డేల్లో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. మూడు సార్లు యాషెస్ సిరీస్ గెలిచిన జట్టులో ఇంగ్లీష్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఇక కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు ఫిన్ మిడిల్‌సెక్స్‌కు ఆడాడు. అనంతరం ససెక్స్ జట్టుతో కలిశాడు. అయితే.. ససెక్స్ తరఫున కేవలం 19 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. ససెక్స్ తరుపున ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడ్డాడు. ఎంతకూ గాయం తగ్గకపోవడంతో తన క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నట్లు ప్రకటన చేశాడు.
ఇదిలా ఉంటే.. నెల రోజుల వ్యవధిలో నలుగు ఇంగ్లాండ్ ఆటగాళ్లు రిటైర్ అయ్యారు. యాషెస్ సిరీస్ 2023 సందర్భంగా మొదట స్టువర్ట్ బ్రాడ్, ఆ తర్వాత మోయిన్ అలీ లు వీడ్కోలు పలకగా ఆ తరువాత కొద్ది రోజుల వ్యవధిలో హార్డ్ హిట్టర్ అలెక్స్ హేల్స్, తాజాగా ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. వీరిలో మోయిన్ అలీ ఒక్కడే టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించి మిగిలిన ఫార్మాట్లలో ఆడుతుండగా మిగిలిన వారు అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.