ఇంగ్లాండ్‌లో కెఎల్ రాహుల్ గొప్ప ఆరంభం.. మొదటి రోజే సెంచరీతో అదరగొట్టాడు.. ఎన్ని ఫోర్లు కొట్టాడంటే..? వీడియో వైరల్
భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు..

India Vs England KL Rahul Century: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఈనెల 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో భారత -ఏ జట్టు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. ఆ జట్టుతో రెండో అనధికార టెస్టులో భారత బ్యాటర్ల జోరు కొనసాగింది. శుక్రవారం మొదలైన ఈ నాలుగు రోజుల మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేశాడు.
భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 168 బంతులు ఎదుర్కొని 116 పరుగులు చేశాడు. 15ఫోర్లు, ఒక సిక్స్ తో సూపర్ సెంచరీ చేశాడు. ఆరంభం నుంచి నిలకడైన బ్యాటింగ్ తో రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ లో రెండు సెంచరీలు చేసిన కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో భారత్ జట్టు ఆడబోయే సీనియర్ ప్లేయర్లలో ఒకరు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత.. జూన్ 20న ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కు ముందు రాహుల్ సెంచరీ చేయడం భారత్ జట్టుకు శుభపరిణామం అని చెప్పొచ్చు. రాహుల్ ఫాంలో ఉంటే ఇంగ్లాండ్ జట్టు బౌలర్లకు ఇబ్బందికరమని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే.. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో కరుణ్ నాయర్ (40), ధ్రువ్ జురెల్ (52) రాణించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తనుష్ కొటియన్ (5), అన్షుల్ కాంబోజ్ (1) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా తొలిరోజు 83 ఓవర్లే సాధ్యమైంది. మొదటి ఇన్నింగ్స్ లో హైదరాబాద్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (34) పరుగులు చేశాడు.
మరోవైపు ఇంగ్లాండ్ లయన్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ హిల్ రెండు వికెట్లు తీశాడు.
🚨 19th FIRST CLASS HUNDRED MOMENT OF KL RAHUL 🚨
– The Backbone of Indian Team. pic.twitter.com/ybEsKGJ5qs
— Johns. (@CricCrazyJohns) June 6, 2025
THE CLASS OF KL RAHUL…!!! 👑
– Important player for India in 2027 WTC Cycle. pic.twitter.com/4xRm3ZJciE
— Johns. (@CricCrazyJohns) June 7, 2025