ECB : ఆస్ట్రేలియా అంటే లెక్క‌లేదా..! ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం.. యాషెస్‌కు రెండు నెల‌ల ముందుగానే..

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య (ENG vs AUS) జ‌రిగే యాషెస్ సిరీస్‌కు దాదాపుగా రెండు నెల‌ల స‌మ‌యం ఉంది. అయిన‌ప్ప‌టికి కూడా..

ECB : ఆస్ట్రేలియా అంటే లెక్క‌లేదా..! ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం.. యాషెస్‌కు రెండు నెల‌ల ముందుగానే..

England squad for Ashes 2025 announced Harry Brook named vice captain

Updated On : September 24, 2025 / 11:13 AM IST

ECB : చిరకాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌,పాక్ ల మ‌ధ్య మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ దేశాల త‌రువాత అంత‌టి క్రేజ్ ఉన్న‌ది ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కే అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదేమో. ముఖ్యంగా యాషెస్ సిరీస్ కోసం ఈ రెండు దేశాలు హోరాహోరీగా పోటీప‌డుతుంటాయి. త‌మ జ‌ట్టు ప్ర‌పంచక‌ప్ సాధించ‌క‌పోయిన ప‌ర్వాలేదు గానీ యాషెస్ గెలిస్తే చాలు అని ఇరు దేశాలు క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటారు అంటే అతి శ‌యోక్తి కాదేమో.

ఈ సారి యాషెస్ సిరీస్ న‌వంబ‌ర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు దాదాపు రెండు నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ టోర్నీలో పాల్గొనే 16 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. బెన్‌స్టోక్స్ సార‌థ్యంలోనే ఇంగ్లాండ్ బ‌రిలోకి దిగ‌నుంది. వైస్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

PAK vs SL : యాక్ష‌న్‌.. రియాక్ష‌న్‌.. ‘న‌వ్వు ఒక్క‌సారి చేస్తే.. నేను రెండు సార్లు చేస్తా..’ పాక్ ఆట‌గాడికి ఇచ్చిప‌డేసిన హ‌స‌రంగ‌.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియాతో టెస్టు సిరీస్‌లో స్టోక్స్ భుజానికి గాయ‌మైంది. దీని నుంచి అత‌డు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సిరీస్ స‌మ‌యానికి అత‌డు పూర్తిగా కోలుకుంటాడు అని ఈసీబీ తెలిపింది. నవంబ‌ర్ 21 పెర్తు వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్‌తో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.

యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జ‌ట్లు ఇదే..

బెన్‌స్టోక్స్‌ (కెప్టెన్‌), ఆర్చర్, అట్కిన్సన్, షోయబ్‌ బషీర్, జాకబ్‌ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్స్, జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్, విల్‌ జాక్స్, ఒలి పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, జోస్‌ టంగ్, మార్క్‌ వుడ్‌.

IND vs BAN : భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కోచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ‘మేమే కాదు, ప్ర‌తి జ‌ట్టు టీమ్ఇండియాను ఓడిస్తుంది..’

యాషెస్ సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టెస్టు – న‌వంబ‌ర్ 21 నుంచి 25 వ‌ర‌కు (పెర్త్‌)
* రెండో టెస్టు – డిసెంబ‌ర్ 4 నుంచి 8 వ‌ర‌కు (గ‌బ్బా)
* మూడో టెస్టు – డిసెంబ‌ర్ 17 నుంచి 21 వ‌ర‌కు (ఓవ‌ల్‌)
* నాలుగో టెస్టు – డిసెంబ‌ర్ 26 నుంచి 30 వ‌ర‌కు (ఎంసీజీ)
* ఐదో టెస్టు – జ‌న‌వ‌రి 4 నుంచి 8 వ‌ర‌కు (సిడ్నీ)